కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి ( Gali Janarthan Reddy )బీజేపీలో చేరారు.
అలాగే తన పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ) ని
బీజేపీలో( BJP ) విలీనం చేశారు.ఈ క్రమంలో మాజీ సీఎం యడియూరప్ప సమక్షంలో తన పార్టీని కమలదళంలో కలిపారు.
ఈ సందర్భంగా గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ తన పార్టీని బీజేపీని విలీనం చేసినట్లు తెలిపారు.మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు కార్యకర్తగా పని చేస్తానని చెప్పారు.
ఎటువంటి షరతులు లేకుండానే తాను బీజేపీలో చేరానన్న గాలి జనార్థన్ రెడ్డి తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని వెల్లడించారు.
తాజా వార్తలు