వైయస్ జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా సీరియస్ వ్యాఖ్యలు..!!

టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా( Devineni Uma ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఇసుక దందాతో( Sand Mafia ) కోట్లాది రూపాయలు దోపిడీ జరుగుతుందని ఆరోపించారు.

జేపీ సంస్థ ముసుగులో వైయస్ జగన్ ( CM Jagan ) అక్రమ ఇసుక దందా చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ఇసుక దందాతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.

జేపీ వెంచర్స్ కి జీఎస్టీ నెంబర్ సస్పెండ్ అయినప్పటికీ అదే కంపెనీ పేరుతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు.నాలుగేళ్లలో ఇసుక దందాలో వైయస్ జగన్ 40 వేలకోట్ల దోచుకున్నారని ఆరోపించారు.

ఇసుకసురిడిగా వైయస్ జగన్ అవతారం ఎత్తరని విమర్శించారు.దీంతో రాష్ట్రంలో సామాన్యుడికి ఇసుక లేకుండా చేశారని మండిపడ్డారు.

Advertisement

రాష్ట్రంలో ఇసుక దోపిడీని నిరసిస్తూ ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ నాయకులతో( TDP ) కలిసి మంత్రి దేవినేని ఉమ వినతి పత్రం సమర్పించారు.ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ టెండర్లు పిలవకుండా కొత్త ఏజెన్సీ ఎంపిక చేయకుండా.

అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు.ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాలు మేరకు బుధవారం విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడి జరుగుతుందని.

దేవినేని ఉమా పేర్కొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్24, ఆదివారం 2024
Advertisement

తాజా వార్తలు