కొంత మంది హీరోలకి ఇండస్ట్రీ లో అసలు మార్కెట్ లేకపోయినా సరే వాళ్లు ఎందుకు సినిమాలు చేస్తూ ఉంటారో ఎవ్వరికి తెలీదు హీరో గా వాళ్ళకి మార్కెట్ లేదు అనుకున్నప్పుడు విలన్ గా అయిన లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయిన వాళ్ళ కెరియర్ ని సాగించాలి.కానీ ప్రొడ్యూసర్స్ లేకపోతే వాళ్లే సొంతంగా మనీ పెట్టుకొని మరి ఎందుకు సినిమాలు చేస్తూ నష్టపోతున్నారో తెలీదు…ఇక ఈ కోవలోకే చెందిన హీరో గా రాజశేఖర్( Rajasekhar ) ని చెప్పవచ్చు…ఈయనకి హీరోగా మార్కెట్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది అయినా కూడా ఈయన హీరో అనే దాని నుంచి తగ్గకుండా ఒన్ గా ప్రొడ్యూస్ చేస్తూ మరి సినిమాలు చేస్తున్నాడు ఈయన తీసిన సినిమాల్లో గరుడ వేగ( Garuda Vega ) సినిమా ఒకటి కొంతవరకు పర్లేదు అనే టాక్ తెచ్చుకున్న కూడా ఆ తర్వాత వచ్చిన సినిమాలు ప్లాప్ అయ్యాయి.
ఇక దాంతో ఉన్న మార్కెట్ కూడా క్లోజ్ అయింది అందుకే ఇక అతను విలన్ పాత్రల వైపు వెళ్తే మంచిది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.ఎందుకంటే తన మార్కెట్ క్లోజ్ అయింది అని తెలిసిన తరువాత జగపతి బాబు కూడా ఇలాగే విలన్ పాత్రలు చేసి ఇప్పుడు చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు…
అందుకే ఇక్కడ మార్కెట్ ఉన్నప్ప్పుడే సినిమాల్లో హీరో గా చేయాలి ఒకసారి అది కోల్పోయాక ఎన్ని సినిమాలు చేసిన అన్ని ప్లాప్ అవుతూనే ఉంటాయి.అందుకే ఒక మంచి సినిమాలో విలన్ గా అయినా, లేదా హీరో తండ్రి క్యారెక్టర్ లో అయిన చేసి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం బెటర్ అని సినీ మేధావులు సైతం రాజశేఖర్ విషయం లో వాళ్ళ అభిప్రయాలని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ మధ్యే శ్రీకాంత్( Meka Srikanth ) కూడా అఖండ లాంటి సినిమాతో విలన్ గా పరిచయం అయ్యాడు.ఇక అతను అటు విలన్ గా చేస్తూనే, ఇటు బాబాయ్ గా కూడా కొన్ని సినిమాల్లో చేస్తున్నాడు…ఒక దారి మూసుకుపోతే ఇంకో దారిలో ట్రై చేయాలి కానీ అదే దారిలో వెళ్తూ నష్టపోకూడదు అని మరికొంత మంది అభిప్రాయం పడుతున్నారు…ఇక రీసెంట్ గా ఆయనికి ఆయన సతీమణి అయిన జీవిత కి ఇద్దరికీ కూడా కోర్ట్ జైల్ శిక్ష విధించింది ఎందుకంటే చిరంజీవి తన బ్లెడ్ బ్యాంక్ ద్వారా వచ్చే బ్లెడ్ అమ్ముకుంటున్నాడు అని చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు చేసిన కామెంట్లకి ఇన్ని రోజుల తరువాత కోర్ట్ వీళ్ళకి శిక్ష విధించడం జరిగింది.