వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికారిక బస్సు యాత్ర రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూ ఉంది.ఏడో రోజు సత్యసాయి జిల్లాలో సాగింది.
ఈ క్రమంలో ధర్మవరంలో( Dharmavaram ) నిర్వహించిన భారీ బహిరంగ సభలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) కూడా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan ) మండిపడ్డారు.ఎవరైనా ముఖ్యమంత్రి కావాలని రాజకీయంగా పైకి రావాలని పార్టీ పెడతారు.
కానీ దత్త పుత్రుడు మాత్రం పక్క వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టాడని.బహుశా ఇలాంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో దత్తపుత్రుడు ఒక్కడేనని విమర్శించారు.

జగన్ నీ( Jagan ) గద్దె దించడమే తన లక్ష్యమంటూ.ప్రతిసారి దత్తపుత్రుడు కామెంట్లు చేస్తారు.జగన్ మోహన్ రెడ్డిని దించటం అంటే ఏమనుకుంటున్నాడో అర్థం కావడం లేదు.జగన్ నీ దించడం మీ వల్ల కాదు కదా.నీ అబ్బ తరం కూడా కాదు.మీరు పొత్తు పెట్టుకుని కట్టకట్టుకుని వచ్చిన ఏమీ చేయలేవు.
ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు జగన్ మోహన్ రెడ్డిని కాపు కాసేందుకు సిద్ధంగా ఉన్నాయి.ఆయనను దించడం ఎవరి వల్ల కాదు అని వ్యాఖ్యానించారు.
ఏపీలో సుపరిపాలన జరగకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కుట్రలు పన్నుతున్నారని విమర్శలు చేశారు.రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత సీఎం జగన్ దే.దీంతో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీని( YCP ) ప్రజలు గెలిపించాలని అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.







