మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఈ మేరకు భార్య దీపతో కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో కమలం పార్టీ గూటికి చేరారు.అంతకముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన వికాస్ రావు హైదరాబాద్ కు చేరుకున్నారు.
కాగా ఈ ర్యాలీలో వికాస్ రావు అనుచరులతో పాటు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి వికాస్ రావు బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు వేములవాడలో గత కొంతకాలంగా వికాస్ రావు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ప్రతిమ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో పలు సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ఆరోగ్య రథం ద్వారా ఆరోగ్య సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.