ఇక్కడా అక్కడా ఎక్కడా పని లేని మాజీ సీఎం ? 

Former CM Who Has No Job Here Or There, Telangana Bjp,bjp, Ap BJP, Telangana Elections, BRS,congress, Nallari Kiran Kumar Reddy, Telangana Elections, AP Elections,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) ప్రచారం హౌరాహోరీగా జరుగుతుంది.పార్టీ కీలక నాయకులంతా ఎన్నికల ప్రచారం లో నిమగ్నం అయ్యారు.

 Former Cm Who Has No Job Here Or There, Telangana Bjp,bjp, Ap Bjp, Telangana Ele-TeluguStop.com

హోరాహోరీగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు ఉంది.గల్లీ స్థాయి నాయకుల నుంచి ఢిల్లీ స్థాయి నాయకుల వరకు అంతా ఎన్నికల పోరులో నిమగ్నం అయ్యారు.

ఇక బీజేపీ విషయం కొస్తే ఆ పార్టీలోను దాదాపుగా అదే పరిస్థితి ఉంది .అయితే కొంతకాలం క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చట్టచేవరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని( Nallari Kiran Kumar Reddy ) బిజెపిలో చేర్చుకున్నారు.  తెలంగాణతో పాటు ఏపీ ఎన్నికల్లోను కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా రెడ్డి సామాజిక వర్గం దృష్టిని ఆకర్షించి పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చూసుకోవడంతో పాటు , ఎన్నికల ప్రచారంలో కిరణ్ కుమార్ రెడ్డిని యాక్టివ్ చేసి రెడ్డి సామాజిక వర్గం మద్దతు బిజెపికి ఉండేలా చూడాలని ప్లాన్ వేశారు.అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పోరు రసూత్రంగా సాగుతున్నా,  కిరణ్ కుమార్ రెడ్డి జాడ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు.

Telugu Ap Bjp, Ap, Congress, Nallarikiran, Telangana Bjp, Telangana-Politics

తెలంగాణ ఎన్నికల కోసమే ఆయనను పార్టీలో చేర్చుకున్నా,  ఆయన కనీసం బిజెపి( BJP ) కార్యాలయంలో కూడా కనిపించడం లేదు.  తెలంగాణలోని సీమాంధ్ర ఓటేర్లను ఆకట్టుకునే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉపయోగపడతారని బిజెపి భావించింది.  అయితే కిరణ్ కుమార్ రెడ్డిని ఎన్నికల ప్రచారానికి దింపితే కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ అనే అభిప్రాయంతో బిజెపి పెద్దలు కూడా ఆయనను పెద్దగా ప్రోత్సహించడం లేదట.  అసలు కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరిన తర్వాత బాగా యాక్టివ్ అవుతారని,  ఏపీ తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారుతారని అధిష్టానం పెద్దలు భావించారు.

అయితే ఆయన మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు.ఆయన తెలంగాణ రాజకీయాల్లో  కనిపించడం లేదు.

Telugu Ap Bjp, Ap, Congress, Nallarikiran, Telangana Bjp, Telangana-Politics

అలా అని ఏపీ రాజకీయాల్లో( AP politics ) యాక్టివ్ గా ఉన్నారంటే అది లేదు అప్పుడప్పుడు కీలకమైన కార్యక్రమాలకు హాజరై వెళ్ళిపోతున్నారు తప్ప , యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.  దీంతో అసలు కిరణ్ కుమార్ రెడ్డిని ఏ ఉద్దేశంతో చేర్చుకున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.దీనికి తగ్గట్లుగానే కిరణ్ కుమార్ రెడ్డి కూడా దూరం దూరంగానే పార్టీ కార్యక్రమాలకు,  ఎన్నికల ప్రచారాలకు ఉండడం తో కిరణ్ కుమార్ రెడ్డి ఏమైంది ? అనే ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube