మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల..!!

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( kcr ) ఫామ్ హౌస్ లో కాలు జారీ పడటంతో తుంటి ఎముక విరగడం తెలిసిందే.ఈ క్రమంలో యశోద ఆసుపత్రిలో( Yashoda Hospital ) కుటుంబ సభ్యులు జాయిన్ చేయడం జరిగింది.

 Former Chief Minister Kcr Health Bulletin Released , Kcr Health Bulletin, Brs, Y-TeluguStop.com

శుక్రవారం సాయంత్రం కేసీఆర్ కి హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయటం జరిగింది.ఈ క్రమంలో శనివారం సాయంత్రం కేసీఆర్ కి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఆపరేషన్ జరిగిన 12 గంటలలోపు రోగి నడవాలని.

అంబులెషైన్స్ గైడ్ లైన్స్ చెబుతున్నాయి.

దీని ప్రకారం కేసీఆర్ బెడ్ మీద నుంచి లేచి నిలబడగలుగుతున్నారు.ఫిజియోథెరపీ, ఆర్థోపెడిక్ వైద్యుల( Physiotherapy , orthopedic doctors ) పర్యవేక్షణలో నడుస్తున్నారు.ఆయనను వైద్య బృందం పర్యవేక్షిస్తుందని హెల్త్ బులిటన్ లో తెలియజేయడం జరిగింది.

ఇదిలా ఉంటే హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ కావడంతో 6 నుంచి 8 వారాలు పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు ముందుగానే తెలియజేశారు.దీంతో కేసీఆర్ రెండు నెలలు పాటు.

ప్రజాక్షేత్రంలోకి రాని పరిస్థితి నెలకొంది.కాగా నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి.

ఈ క్రమంలో కేసీఆర్.లేకుండానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు హాజరయ్యారు.

ఇక ఇదే సమయంలో కేటీఆర్ కూడా గైర్హాజరు కావడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube