ఏర్పాట్ల పై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చిన్న చిన్న లోటుపాట్లను సరిచేసుకోవాలని అధికారులకు సూచించాం నిన్న 80 వేల మంది వరకూ అమ్మవారిని దర్శించుకున్నారు సీతమ్మపాదాల వద్ద భక్తుల సౌకర్యార్ధం ఇరిగేషన్ శాఖ నుంచి నాలుగున్నర ఎకరాల స్థలం లీజుకు తీసుకుంటున్నాం ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టం .
అవసరమైనప్పుడు భక్తుల సౌకర్యార్ధం తీసుకుంటాం స్థలం కేటాయింపు పై మంత్రి అంబటిరాంబాబు లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు భక్తుల కోసం స్థలం కేటాయించినందుకు మంత్రి అంబటి రాంబాబుకు కృతజ్ఞతలు మూలానక్షత్రం రోజున ఏర్పాట్లు చేయడం ఒక సవాల్ అమ్మవారి దర్శనానికి లక్షల్లో భక్తులు వస్తారు రేపు సీఎం జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారుసీఎం రాక నేపధ్యంలో 45 నిమిషాల పాటు దర్శనాలకు బ్రేక్ భక్తుల కోసం ఎల్ఇడీ డిస్ ప్లే ఏర్పాటు చేస్తాం క్యూలైన్లలో భక్తులకు మంచినీరు, పాలు, మజ్జిగ అందజేస్తాం రేపు అందరికీ దర్శనాలు ఉచితమే ఎలాంటి టిక్కెట్ రుసుము వసూలు చేయము
.