కొబ్బరికాయలు పగలకొట్టగానే అందులో ఉన్న కొబ్బరిని టెంక నుంచి వేరు చేయడానికి చాలామంది కష్టపడుతుంటారు.చాకులను వాడటం లేదా వాటిని బలంగా నేలకేసి కొట్టడం లాంటివి చేస్తుంటారు.
అయితే అంత కష్టపడకుండా ఈజీగా కొబ్బరికాయ నుంచి కొబ్బరి ట్యాంకును వేరు చేయొచ్చని ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా ఒక వీడియో ద్వారా వెల్లడించారు.ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో చాలా సింపుల్ ట్రిక్ తో అతను కొబ్బరి టెంకాయ నుంచి కొబ్బరిని ఈజీగా వేరు చేశాడు.
ఈ వీడియో కాస్త ఇప్పుడు విస్తృతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో, చెఫ్ వికాస్ ఖన్నా కొబ్బరికాయను పగలగొట్టాడు.
తర్వాత కొబ్బరికాయలో ఒక సగ భాగాన్ని తెరిచి మంట మీద పెట్టాడు.పెంకు నల్లగా మారిన తర్వాత, అతను దానిని తీసుకొని చల్లటి నీటిలో జాగ్రత్తగా ఉంచాడు.
అంతే, గట్టి పెంకు నుంచి కొబ్బరికాయ సులభంగా బయటకు వచ్చింది.వికాస్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కొంతమంది స్థానిక మహిళల నుండి ఈ ట్రిక్ నేర్చుకున్నాడు.

“నేను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్నాను, ఒక స్థానిక మహిళ ప్రో లాగా ఈ ట్రిక్ చేయడం నేను చూశాను.ఇది నిజంగా కొబ్బరి రకం దాని వయస్సుపై ఆధారపడి పనిచేస్తుంది.కొన్నిసార్లు కొబ్బరిని టెంకాయ నుంచి వేరు చేయడానికి మీకు కత్తి అవసరం కావచ్చు.కానీ ఇది చాలా సందర్భాల్లో పని చేస్తుంది” అని పోస్ట్‌లో అతను పేర్కొన్నారు.
ఈ వీడియోని మీరు కూడా చూసేసి ఈ ట్రిక్ ఫాలో అవ్వండి.







