అక్టోబర్ 15వ తారీకు విశాఖపట్నంలో “విశాఖ గర్జన” కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.మూడు రాజధానులకు మద్దతుగా జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ మంత్రులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం మంత్రులు విమానశ్రయానికి వెళ్తున్న సమయంలో అదే టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తూ ఉండటంతో విమానాశ్రయం వద్ద జనసేన పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు.ఈ క్రమంలో వైసీపీ మంత్రులు విమానాశ్రయానికి చేరుకోవటంతో… ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.
వైసీపీ మంత్రులపై జనసేన పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి.అనంతరం పలువురు జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.దీంతో ఈ ఘటన జరుగుతున్న సమయంలో విశాఖ విమానాశ్రయంలో విధులు నిర్వర్తిస్తున్న పశ్చిమ సబ్ డివిజన్ ఇన్‌చార్జ్ ఏసీపీ టేకు మోహనరావు, సీఐ ఉమాకాంత్ బాధ్యతారహితంగా వ్యవహరించినట్లు పై అధికారులు గుర్తించారు.అనంతరం ఉమాకాంత్ నీ పోలీస్ కమిషనర్ విఆర్ కి తరలించడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ ఇద్దరు ఉన్నత అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.







