ఫ్రెంచ్ బీన్స్ ను( French Beans ) అధికంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బిర్యానీ పాయింట్లు తమ వంటకాలలో అధికంగా ఉపయోగిస్తారు.కాబట్టి ఈ పంటకు డిమాండ్ చాలా ఎక్కువ.
మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలను పండిస్తేనే రైతులకు లాభాలు వస్తాయి.అందుకే చాలామంది రైతులు( Farmers ) ఈ పంటను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ పంటను ఎలా సాగు చేయాలో.మేలైన యాజమాన్య పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం.
ఈ పంటను వేసవి కాలంలో జనవరి, ఫిబ్రవరి నెలలో సాగు చేయవచ్చు.శీతాకాలంలో( Winter ) అయితే అక్టోబర్, నవంబర్ నెలలో సాగు చేయవచ్చు.అయితే అధిక వర్షపాతం ఉష్ణోగ్రతలో అధిక హెచ్చుతగ్గులు ఉంటే బీన్స్ మొక్క పువ్వులు, పిందెలు రాలిపోతాయి.నేల యొక్క పీహెచ్ విలువ 5.2-6.0 మధ్య ఉండే అన్ని రకాల నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి.ఉష్ణోగ్రత( Temperature ) విషయానికి వస్తే 17 నుండి 20 డిగ్రీల మధ్య ఉండే ఉష్ణోగ్రత ఈ పంటకు చాలా అనుకూలం అనే చెప్పాలి.

ఈ పంట రెండు రకాలుగా సాగు చేయవచ్చు.ఒకటి తీగ మరొకటి పొద.వాతావరణ పరిస్థితులు, నేల భూస్వారాన్ని( Soil Quality ) బట్టి విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.తీగ రకం విత్తనాలను సాగు చేస్తే ఒక ఎకరానికి 12 కిలోల విత్తనాలు అవసరం.పొద రకం విత్తనాలను సాగు చేస్తే ఒక ఎకరానికి 24 కిలోల విత్తనాలు అవసరం.
ముందుగా ఈ విత్తనాలను విత్తన శుద్ధి చేసుకుంటే తెగుళ్ల, చీడపీడల బెడద చాలావరకు నివారించవచ్చు.

20-30 సెంటీమీటర్ల దూరంలో బోధలు చేసుకుని విత్తనాలను విత్తుకోవాలి.వారానికి ఒకసారి నీటి తడిని అందించాలి.ఈ సాగులో పిందే దశ కీలకం.
బీన్స్ మొక్క పిందె దశలో ఉన్నప్పుడు నేలలో తేమ ఉండేలా చూసుకోవాలి.పొలంలో ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.
ఏవైనా తెగులు లేదా చీడపీడలు పంటను ఆశిస్తే తొలి దశలోనే వాటిని నివారించే చర్యలు చేపట్టాలి.







