ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.ప్రస్తుతం భద్రాచలం బ్రిడ్జి వద్ద గోదావరి నీటిమట్టం 54.30 అడుగులుగా ఉంది.దీంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
అదేవిధంగా దిగువకు సుమారు 15 లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.గోదావరి వరద పెరుగుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాలు మరియు ముంపు ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
దాంతో పాటు పోలీస్ రెస్క్యూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం ప్రజలు 8712682128 నంబర్ కు ఫొటోలు, లోకేషన్ పంపి పోలీసుల సహాయం పొందవచ్చని సూచించారు.ఈ నేపథ్యంలో పడవలు, బోట్లు, గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లను సిద్ధం చేశారు.