ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ఆ రెండు ఫీచర్స్ లాంచ్!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.ఇందులో భాగంగా తాజాగా ఇది రెండు ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేసింది.

 Flipkart Redesigned Home Page And Kirana Shopping Section For More User Experience Details, Flipkart, Flipkart New Features, Latest News, Bew ,flipkart New Features, Redesigned Home Page ,kirana Shopping , User Experience, Flipkart Users-TeluguStop.com

హోమ్‌ పేజీ నావిగేషన్‌ మరింత సులభతరం చేసేందుకు యాప్‌ను రీడిజైన్ చేసింది.ఈ కొత్త డిజైన్ పట్టణ, గ్రామీణ ప్రజలకు బాగా ఉపకరిస్తుంది.

యాప్‌లో హోమ్ పేజీని రీడిజైన్ చేసిన ఫ్లిప్‌కార్ట్‌ కిరాణా షాపింగ్ కొరకు స్పెషల్‌గా ఒక సెక్షన్ కూడా తీసుకొచ్చింది.ఇలా సరికొత్త హోమ్‌ పేజీ నావిగేషన్, కిరాణా షాపింగ్ సెక్షన్ అనే 2 ఫీచర్లను ఫ్లిప్‌కార్ట్‌ లాంచ్ చేసింది.

 Flipkart Redesigned Home Page And Kirana Shopping Section For More User Experience Details, Flipkart, Flipkart New Features, Latest News, Bew ,flipkart New Features, Redesigned Home Page ,kirana Shopping , User Experience, Flipkart Users-ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ఆ రెండు ఫీచర్స్ లాంచ్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆండ్రాయిడ్ కస్టమర్లకు ఈ కొత్త డిజైన్ ఇప్పటికే అందుబాటులోకి రాగా ఐఓఎస్ యూజర్లకు జూన్‌లో రిలీజ్ కానుంది.

సరి కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో షాపింగ్, కార్ట్, నోటిఫికేషన్లు వంటివి స్క్రీన్ కింది భాగంలో కనిపిస్తాయి.

దీని వల్ల కేవలం బొటనవేలితో అన్ని ఆప్షన్లను చకచకా యాక్సెస్ చేయొచ్చు.కిరాణా షాపింగ్ అనేది యాప్‌లో స్పష్టంగా కనిపించేలా స్క్రీన్ కింద ఇవ్వటం వల్ల అందరూ తెలుసుకోగలుగుతారు.

దీనివల్ల ఎక్కువమంది కిరాణా వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Telugu Flipkart, Kirana, Latest, Page, User Experience-Latest News - Telugu

వాస్తవానికి కిరాణా సామాగ్రి ద్వారానే ఫ్లిప్‌కార్ట్‌కు అధిక లాభం వస్తుంది.ఇక ఈ కంపెనీ దానికోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్ తీసుకొచ్చింది.సిటీలలో ఉండే చాలా మంది ప్రజలు కిరాణా వస్తువులను కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌పైనే ఆధారపడుతున్నారు.

ఈ కొత్త ఫీచర్లు అటు యూజర్లకు ఇటు ఫ్లిప్‌కార్ట్‌కి బాగా హెల్ప్ అవుతాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube