అప్ప‌ట్లో విమాన టిక్కెట్లు చేతితో రాసేవారు: 86 ఏళ్ల ఎయిర్ హోస్టెస్

ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగం అంత సులభం కాదు.దీనికి సంబంధించిన ప‌లు ఉదాహ‌ర‌ణ‌లు మ‌నం గతంలో చూశాం.

 Flight Tickets Were Written By Hand , Air Hostes ,senior,flight Tickets ,light A-TeluguStop.com

ఇండిగో విమానంలోని ఎయిర్ హోస్టెస్ విష‌యంలో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు.ఎయిర్ హోస్టెస్ ఎంత‌గా న‌చ్చ‌జెప్పినా, ఆ ప్ర‌యాణికుడు త‌న వాద‌న మాన‌లేదు.

చివరికి ఎయిర్ హోస్టెస్ తాను పనిమనిషిని కాదని చెప్పవలసిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.విమానయాన రంగానికి ఇది పెద్ద సవాలు లాంటిది.

బెట్టె నాష్ కొన్ని దశాబ్దాలుగా ఈ సవాళ్ల‌తో కూడిన ఈ పనిని చేస్తూ వ‌స్తోంది.

ఈ రోజుకి కూడా ఆమె సంతోషంగా ప‌ని చేస్తోంది.

ఎయిర్ అటెండెంట్‌గా ఆమె ప్రయాణం 1957లో మొదలైంది.అప్పుడు విమాన ఛార్జీ $12 (దాదాపు రూ.990).నాష్ ఈ ఏడాదితో 86 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.

అత్యంత సుదీర్ఘ‌కాలం విమాన సేవకురాలిగా ప‌నిచేయ‌డంతో ఆమె పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.బెట్టె నాష్ ప్రపంచంలోనే అత్యధిక వ‌య‌సు క‌లిగిన‌ ఎయిర్ హోస్టెస్.

నవంబర్ నాటికి ఆమె అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తూ 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఎయిర్ హోస్టెస్ కావాలనే కోరిక ఆమెకు 16 ఏళ్ల వ‌య‌సులోనే క‌లిగింది.

ఈ సంగ‌తి 1952 నాటిది.ఆమె ఆర్లింగ్టన్‌లోని రీగన్ జాతీయ విమానాశ్రయం నుండి ఒహియోకు ప్రయాణించింది.

ఆమె ఫ్లైట్ కోసం తన తల్లితో కలిసి వెయిట్ చేస్తోంది.ఈ సమయంలో ఆమె చూపు అక్క‌డి సిబ్బందిపై పడింది.

వారిలో ఒక విమాన సహాయకురాలు, ఇద్దరు పైలట్లు ఉన్నారు.వారు చాలా మర్యాద పూర్వ‌కంగా ప్రవర్తించారు.

Telugu Air Hostes, Air Hostess, American, Bette Nash, Tickets, Attendant Job, Se

వారు ధ‌రించిన దుస్తులు నాష్ హృదయాన్ని గెలుచుకున్నాయి.అప్పుడే తాను కూడా ఈ ఇండస్ట్రీలో అడుగుపెట్టాల‌ని ఆమె మనసులో నిశ్చ‌యించుకుంది.21 ఏళ్ల వయసులో ఆమె కల నెరవేరింది.ఐసెన్‌హోవర్ అప్ప‌ట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు.

అతని కాలంలో అమెరికన్ విమానయాన పరిశ్రమ ఉన్న‌త శిఖ‌రాల‌ను తాకింది.ఆ రోజుల్లో టిక్కెట్లు చేతితో రాసేవారు.

అస‌లు రిజర్వేషన్ అవసరమే లేదు.నాష్ చాలా కాలంగా న్యూయార్క్-వాషింగ్టన్-బోస్టన్ మార్గంలో ప్రయాణిస్తుంటారు.

ఇది 1961 నుండి కొనసాగుతోంది.ఆమెను తోటి సిబ్బందిని ‘నాష్-డాష్’ అని పిలుస్తారు.

ఆమె ప్రతిరోజూ మసాచుసెట్స్‌లోని ఇంటికి తిరిగి వస్తుంది.అక్క‌డ ఆమె వికలాంగుడైన కుమారునితో పాటు ఉంటోంది.

ఆమె తన సుదీర్ఘ కెరీర్‌లో ప్రయాణికులకు ఫస్ట్‌క్లాస్‌ సేవలు అందించారు.ఆమెతో ప్రయాణించిన‌ ప్రయాణికులు ఆమెను ఎప్పటికీ మర‌చిపోరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube