ఎయిర్‌లైన్స్ సంస్ధలు( Airlines companies ) ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు అనేక ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి.ఫ్లైట్ టికెట్ ధరల్లో డిస్కౌంట్ లు లేదా రాయితీలు ప్రకటిస్తూ ఉంటాయి.
అలాగే తక్కువ ధరకు టికెట్లను అందిస్తూ ప్రయాణికుల సంఖ్యను పెంచుకుని లాభాలు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి.అలాగే ప్రత్యేక ఈవెంట్స్ సమయంలో కూడా ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి.
తాజాగా టాటా గ్రూప్ సంస్థ( Tata Group company ) ఎయిర్‌లైన్ విస్తారా మంచి ఆఫర్‌ను ప్రకటించింది.అతి తక్కువ ధరకే విదేశాలకు వెళ్లేందుకు టికెట్ ధరలపై ఆఫర్లు ప్రకటిస్తోంది.

తాజాగా విస్తారా వర్షాకాలం సందర్బంగా ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రటించింది.కేవలం 12 వేలకు విదేశాలకు వెళ్లి వచ్చేలా రౌండ్ ట్రిప్ టికెట్‌ను ప్రకటించింది.ఇక దేశీయ విమాన టికెట్ రూ.1499కే అందిస్తోంది.విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు రూ.11,799కే టికెట్ ఇస్తామని, ఇంత తక్కువ ధర ఏ ఎయిర్ లైన్ సంస్థ ఇవ్వదని చెబుతోంది.ఈ టికెట్ తో విదేశానికి వెళ్లడంతో పాటు తిరిగి రావొచ్చు.
ఈ ఆఫర్ జులై 4 వరకు అందుబాటులో ఉండనుంది.ఈ ఆఫర్ ద్వారా ఇప్పుడే వచ్చే ఏడాది మార్చి 23 వరకు చేసే ప్రయాణానికి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

దీంతో జులై 4 లోపు టికెట్ బుక్ చేసుకుంటే వచ్చే ఏడాది మార్చిలోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు.టికెట్లను బుక్ చేసుకునేందుకు విస్తారా అాధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.లేదా ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఎయిర్‌పోర్టులోని టికెట్ కార్యాలయం లేదా కాల్ సెంటర్, ఏదైనా ఆన్ లైన్ ఏజెంట్, ట్రావెలింగ్ ఆఫీస్ ద్వారా టికెట్ ను కొనుగోలు చేయవచ్చని విస్తారా స్పష్టం చేసింది.







