సిరిసిల్ల పట్టణంలో ఫ్లాగ్ మార్చ్

రాజన్న సిరిసిల్ల జిల్లా: శాంతియుత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( District SP Akhil Mahajan ) ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బిఎస్ఎఫ్,జిల్లా జిల్లా పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్.

ఈ సందర్భంగా సి.

ఐ ఉపేందర్( CI Upender ) మాట్లాడుతూ రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ,పారదర్శక, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రజలందరికీ పోలీసులు ఎల్లవేళలా తోడుంటారని ధైర్యాన్ని కల్పించడానికి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్, శ్రీనగర్ కాలనీ,జ్యోతి నగర్, చంద్రంపెట్,పోచమ్మ వాడ, రగుడు వరకు బిఎస్ఎఫ్ బలగాలు, జిల్లా పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు.ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.

ఈ ఎన్నికలను శాంతియుత వాతావరణం లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ లు అన్ని ప్రాంతల్లో బీనిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు కీలకపాత్రను పోషిస్తాయని ప్రతి క్రిటికల్ పోలింగ్ కేంద్రాల నందు సాయుద బలగాలతో కూడిన బిఎస్ఎఫ్ సిబ్బంది విధులను నిర్వహిస్తుంటారని తెలిపారు.ఈ ఫ్లాగ్ మార్చ్ లో ఎస్.ఐ పోలీస్ సిబ్బంది,బి ఎస్ ఎఫ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News