నేటి నుంచి ఐపీఎల్ లో ఐదు సరి కొత్త రూల్స్.. నో బాల్, వైడ్ లపై డీఆర్ఎస్ కోరే అవకాశం..!

Five New Rules In IPL From Today Chance To Ask For DRS On No Ball, Wide , DRS, IPL, Impact Player, Wide, Drs To Noballs, Chennai Super Kings , Gujarat Titans

ఐపీఎల్ సీజన్ -16 మరికాసేపట్లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ – గుజరాత్ టైటాన్స్ ( Chennai Super Kings – Gujarat Titans )మధ్య తొలి మ్యాచ్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.కరోనా కారణంగా దాదాపుగా మూడేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో ఈ సీజన్ అట్టహాసంగా జరుగనుంది.

 Five New Rules In Ipl From Today Chance To Ask For Drs On No Ball, Wide , Drs, I-TeluguStop.com

ఈ సీజన్లో 10 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.క్రికెట్ లో కొన్ని సమస్యలకు శాశ్వతంగా పెట్టడం కోసం ఈ ఐపీఎల్ లో ఐదు సరికొత్త రూల్స్ పెట్టడం జరిగింది.ఈ రూల్స్ తో కొన్ని సమస్యలకు పెట్టొచ్చు అవేంటో చూద్దాం.

1.టాస్ తరువాత జట్ల ప్రకటన: ఇంతవరకు టాస్ వేయకముందే తమ తుది జట్టుకు సంబంధించిన షీట్లను మ్యాచ్ రిఫరీ కి అందించేవారు.ప్రస్తుతం ఈ నిబంధనలో కాస్త మార్పు చేసి టాస్ వేసిన తర్వాత తమ తుది జట్లను ప్రకటించే అవకాశం కల్పించబడింది.

2.ఇంపాక్ట్ ప్లేయర్: ఇంపాక్ట్ ప్లేయర్ అంటే పరిస్థితులను బట్టి 12వ ఆటగాడిని కూడా ఆడించే అవకాశం కల్పించడం.ఈ 12వ ఆటగాడు కెప్టెన్ గా ఉండడానికి అవకాశం లేదు.కేవలం బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ల కోసం ఉపయోగించుకోవచ్చు.జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉంటే, 12వ ఆటగాడిగా మరో విదేశీ ప్లేయర్ ను తీసుకోకుండా తప్పకుండా ఇండియన్ ఆటగాడినే తీసుకోవాలి.

3.వైడ్, నోబాల్స్ కు డీఆర్ఎస్: క్రికెట్ లో ఎప్పుడు వైట్ బాల్స్, నో బాల్స్ విషయంలో వివాదాలు తలెత్తడం సహజం.కానీ వీటి శాశ్వత పరిష్కారం కోసం ఆటగాళ్లు అనుమానం ఉంటే వైడ్, నోబాల్స్ విషయంలో డీఆర్ఎస్ కోరవచ్చు.

4.వికెట్ కీపర్ పైనా వేటు: బ్యాటర్ బంతిని కొట్టక ముందే వికెట్ కీపర్ కదిలితే అతనిపై అనుచిత కదలిక జరిమానా విధించబడుతుంది.

5.స్లో ఓవర్ రేటుకు జరిమానా:ఐపీఎల్( IPL ) లో 90 నిమిషాలలో 20 ఓవర్లు పూర్తి చేయాల్సిందే.ఒకవేళ నిర్ణీత సమయంలో 20 ఓవర్లు పూర్తి చేయకుంటే ఆ తర్వాత ప్రతి ఓవర్ కు 30 యార్డ్ సర్కిల్ లోపల అదనపు ఆటగాడిని ఉంచాల్సి ఉంటుంది.

Video : నేటి నుంచి ఐపీఎల్ లో ఐదు సరి కొత్త రూల్స్ నో బాల్, వైడ్ ల #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube