US Congress midterm polls : యూఎస్ కాంగ్రెస్ బరిలో ఐదుగురు భారతీయులు... సర్వేలు ఏం చెబుతున్నాయంటే..?

అమెరికన్ రాజకీయాల్లో భారతీయుల హవా పెరుగుతున్న సంగతి తెలిసిందే.కౌన్సిలర్లు, మేయర్లు, సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు, దేశ ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు.

ఈ క్రమంలో నవంబర్‌ 8న జరగనున్న మధ్యంతర ఎన్నికల్లోనూ పలువురు భారతీయులు బరిలో నిలిచారు.భారత సంతతికి చెందిన ఐదుగురు వ్యక్తులు అమెరికా ప్రతినిధుల సభ రేసులో వున్నారు.

పోల్‌స్టర్లు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం భారతీయ అమెరికన్లు వందకు వంద శాతం ప్రతినిధుల సభలో కాలుపెట్టే అవకాశం వుంది.అమీబేరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌లు మళ్లీ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యే అవకాశం వుంది.

వీరు నలుగురు అధికార డెమొక్రాటిక్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.ప్రతినిధుల సభలో భారతీయ అమెరికన్ల సమోసా కాకస్‌గా పిలవబడే మిచిగాన్‌లోని 13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈసారి భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త శ్రీథానేధర్‌ బరిలో నిలుస్తున్నారు.

Advertisement

అమీబేరా (57) వీరందరిలోకి సీనియర్.కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు ఆరోసారి పోటీపడుతున్నారు.కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రో ఖన్నా (46).

రాజా కృష్ణమూర్తి (49) ఇల్లినాయిస్‌లోని 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ప్రమీలా జయపాల్ (57) వాషింగ్టన్‌ రాష్ట్రంలోని 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి వరుసగా నాల్గవసారి పోటీలో నిలిచారు.

రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.ఈ నలుగురూ తమ రిపబ్లికన్ ప్రత్యర్ధులపై పైచేయి సాధిస్తారని చెబుతున్నారు.

డెట్రాయిట్‌లోని ఆఫ్రికన్- అమెరికన్లు ఎక్కువగా వున్న ఏరియా నుంచి తొలిసారి పోటీపడుతున్న శ్రీథానేధర్ విజయం కూడా నల్లేరుపై నడకేనన్న అంచనాలు వెలువడుతున్నాయి.

అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని
Advertisement

తాజా వార్తలు