గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాలయ్య బాబు ( Balakrishna )అలాగే ఎన్టీఆర్ అభిమానుల మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.నందమూరి తారకరామారావు ఘాట్ వద్ద ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వేయడంతో వెంటనే బాలయ్య బాబు కోపంతో వాటిని తీసేయండి అనడంతో అప్పటి నుంచి బాలయ్య బాబు ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఘర్షణ మొదలైంది.
ఒకటిగా ఉండాల్సిన నందమూరి అభిమానులు ఎన్టీఆర్, బాలకృష్ణ ఫ్యాన్స్ అంటూ విడిపోయి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.దీంతో ఇప్పుడు ఈ ఫ్యాన్స్ వార్ పీక్స్ కి చేరింది.
ఇంకా చెప్పాలంటే అది పర్సనల్‌గా వెళ్తుంది.
ఎన్ ట్యాగ్ తీసేయాలని డిమాండ్ చేసే స్థాయికి చేరుకుంది.నందమూరి తారక రామారావు వర్థంతిని పురస్కరించుకుని నందమూరి ఫ్యామిలీ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సమాధికి నివాళ్లు అర్పించారు.ఇందులో ఎన్టీఆర్( NTR ) ఫ్లెక్సీలను బాలకృష్ణ తొలగించాలనే కామెంట్ పెద్ద వివాదంగా మారింది.
బాలకృష్ణ ఇప్పుడే.తీసేయ్ అనే డైలాగ్లు వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఆయన ఎన్టీఆర్ ఫ్లెక్సీలనే తీసేయమన్నారని అంతా అనుకుంటున్నారు.మీడియాలోనూ అదే ప్రొజెక్ట్ అయ్యింది.
అయితే మురళి అనే వ్యక్తి హైలైట్‌గా ఈ ఫ్లెక్స్ లు ఉన్నాయని, అదే సమయంలో వర్థంతి రోజు స్వాగతం, సుస్వాగతం ఫ్లెక్సీలేంటి అని బాలయ్య వాటిని తొలగించమన్నారని ఆయన అభిమానులు, అనుచరులు చెబుతున్నారు.
కానీ అప్పటికే జరగాల్సిన నష్టం, వెళ్లాల్సిన సందేశం వెళ్లిపోయింది.కావాల్సినంత వివాదం జరిగింది.ఈ వివాదం రాజకీయ రంగుపులుముకుంది.
దీనిపై టీడీపీ, వైసీపీ నాయకులు రియాక్ట్ కావడంతో రచ్చ మరింత పెద్దదైంది.అయితే ఈ సందర్భంగా బాలకృష్ణ ఫ్యాన్స్ ఛాటింగ్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది.
ఈ సందర్భంగా నిన్ననే బాలయ్య అభిమానులు ట్విట్టర్ స్పేస్‌లో కలుసుకున్నారు.బాలయ్య, ఎన్టీఆర్ సినిమాలపై చర్చించారు.
ఇందులో బాలయ్య ఫ్యాన్స్..
తారక్ సినిమాలపై విమర్శలు చేశారు.ఇప్పటి వరకు చెప్పుకోవడానికి ఒక్కటి కూడా వంద కోట్ల సినిమా లేదంటూ, అది నీ స్టార్ డమ్ అంటూ ఫైర్ అవుతున్నారు.
అంతేకాదు ముందు ఎన్ అంటే నందమూరి అనే ట్యాగ్ తీసేయమని అంటున్నారు.అది పెట్టుకుని తమ పరువు తీస్తున్నారని, ఒకప్పుడు బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు పోటాపోటీగా ఆడేవని, ఒకసారి వాళ్లు హిట్ కొడితే, మరో సారి వీళ్లు హిట్ కొట్టేవారని, ఆ పోటీ ఎప్పుడూ ఉండేదని, కానీ ఎన్టీఆర్ సినిమాలు ఎవరికీ పోటీ ఇవ్వడం లేదని, కనీసం ఇప్పటి వరక ఒక్క వంద కోట్ల సినిమా లేదని వాళ్లు మండి పడుతున్నారు.
అంతేకాదు ఈ సందర్భంగా పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ లో నీ ఒక్కడితో ఇండస్ట్రీ హిట్ సినిమా చేయడం కష్టమని భావించి రామ్‌చరణ్‌ని తీసుకున్నాడని, అందులో తనది చిన్న రోలే అని, చరణ్ సపోర్ట్ తోనే ఆ హిట్ సాధ్యమైందన్నారు.ఇలా చిలికి చిలికి యుద్ధం గాలివానగా మారింది.మరి ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ అలాగే ఎన్టీఆర్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.ఆ ఇద్దరు హీరోలు ఎవరో ఒకరు స్పందించే వరకు ఈ వివాదం ఆగేలా కనిపించడం లేదు.