సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు హీరోలు ఎందుకో ఒక సినిమాకే చిరకాలం గుర్తుండి పోతారు.కానీ ఒకటే సినిమాతోనే తమ సినిమా జీవితాన్ని ముగించుకుంటారు.
అలా ఇప్పటికీ చాలామంది హీరోలు ఒక్క సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నారు.ఒక్క సినిమాతోనే ప్రేక్షకులలో మంచి అభిమానం సంపాదించుకున్నారు.
ఆ ఒక్క సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కూడా మళ్లీ కూడా ఎందుకో అవకాశాలు అందుకోలేక సినిమా జీవితంలో ఫెయిల్ అవుతూ కేవలం అభిమానుల దృష్టిలో గుర్తుండి పోయేలా ఉండిపోయారు.అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక సినిమాలో నటించిన కూడా ఎప్పటికీ గుర్తుండి పోయే హీరోలుగా ఉన్నారు.ఇంతకూ వాళ్ళేవరంటే.
యశో సాగర్:
తెలుగు సినీ నటుడు యశో సాగర్.ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు.ఏ కరుణాకర్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా మంచి ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఇందులో యశోసాగర్ సరసన స్నేహ ఉల్లాల్ నటించింది.
ఈ సినిమా 2008 లో విడుదల అయింది.ఇక ఈ సినిమాను మలయాళం, కన్నడ భాషలలో కూడా రీమేక్ చేశారు.ఇక ఈ సినిమాతోనే ఈ హీరో మంచి పేరు సంపాదించుకొని మంచి అభిమానం సంపాదించుకున్నాడు.
కానీ అంతలోనే ఈ లోకానికి దూరమయ్యాడు.తన మొదటి సినిమా తర్వాత ఆయనకు మరో సినిమాలో అవకాశం రాగా ఇక ఆ సినిమా షూటింగ్ కు వెళ్తున్న సమయంలో కారు ప్రమాదంలో చనిపోయాడు.
రవికృష్ణ
: సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2004లో విడుదలైన సినిమా 7జి బృందావన్ కాలనీ.తెలుగు, తమిళ భాషలో వచ్చిన ఈ సినిమా ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కింది.
ఇందులో రవికృష్ణ, సోనియా అగర్వాల్ నటీనటులుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇక ఆ సినిమాతోనే రవి కృష్ణ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.తొలి సినిమాతోనే తన నటనతో మరో స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతేకాకుండా అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.కానీ సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్ లో ఏ సినిమాల్లో కూడా నటించలేకపోయాడు.కానీ ఇప్పటికీ అభిమానుల మనసులో మంచి నటుడుగా మిగిలిపోయాడు.
కునాల్ సింగ్:
ప్రేమికుల రోజు సినిమా తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు కునాల్ సింగ్. 1990లో కదిర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.మంచి ప్రేమ కథతో మంచి సక్సెస్ అందుకుంది.ఇందులో కునాల్ సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది.
ఈయన కూడా ఈ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకున్నాడు.
కానీ అంతలోనే ఈ లోకం నుండి దూరమయ్యాడు.ఈయన ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
అంతే కాకుండా వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడంతో అవి తట్టుకోలేక 30 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు.