తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీ( SB Organics Industry )లో అగ్ని ప్రమాదం జరిగింది.రియాక్టర్ పేలటంతో మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.హత్నూర మండలం చందాపూర్ శివారులో ఈ ఘటన జరిగింది.
క్షతగాత్రులను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఇదే సమయంలో హైదరాబాద్ ఫిలిం ఛాంబర్( Hyderabad Film Chamber ) లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.స్వరూచి హోటల్ కిచెన్ లో మంటలు చెలరేగాయి.
భారీగా మంటలు ఎగసిపడుతూ ఉండటంతో.చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఫిలిం ఛాంబర్ భవనం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో అలుముకున్నాయి.దీంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టడం జరిగింది.ఫిలిం ఛాంబర్ మెయిన్ రోడ్డుపై ఉండటంతో పొగతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు.మరోపక్క అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.ఈ అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్( Short Circuit ) కారణంగా జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాద సంఘటనలు సంచలనంగా మారాయి.
సంగారెడ్డి ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఫ్యాక్టరీ డైరెక్టర్ సైతం మరణించినట్లు సమాచారం.