వింత పోకడ: అక్కడ ఎవరన్నా చనిపోతే తమ ఇళ్లల్లో వున్న స్త్రీల చేతి వేళ్ళు ఒక్కొక్కటిగా తెగిపోతాయి?

ఏంటి ఆశ్చర్యంగా వుందా? ఇక్కడ ప్రస్తావించింది నిజమే.ప్రపంచం ఓ వైపు సాంకేతికంగా.

 Finger Cutting Tradition Of Dani Tribe Of Indonesia Details, New Tradition, Vira-TeluguStop.com

ప్రగతి పథంలో దూసుకుపోతుంటే.మరోవైపు.

కొంతమంది గిరిజన తెగలు తమ పూర్వ సంస్కృతులను నేటికీ గుడ్డిగా ఫాలో అవుతున్నారు.ఈ ప్రపంచంలో అడవులలో నివాసిస్తున్న అనేక తెగల వారు ఆధునికతకు దూరంగా.

ఆటవిక జీవితాన శైలిని దగ్గరగా జీవిస్తున్నారు.మనం చిన్నపుడు పాఠ్యపుస్తకాలలో చదువుకున్నట్టుగా వారు ఆదిమ మానవుల వలె అడవిలోనే జీవనాన్ని కొనసాగిస్తుంటారు.

వారి ఆహారం, జీవనశైలి చాలా విచిత్రంగా అనిపిస్తుంది.

ఇండోనేషియాలోని పాపువా న్యూ గినియాలో నివసించే ‘డాని’ తెగకు చెందిన ఆదివాసీల ఆచారాలు గురించి వింటే మీకు మతులు పోతాయి.

ఇప్పటికీ ఇలాంటి సంప్రదాయాలను పాటించే వారున్నారా అనే అనుమానం కలగక మానదు.ఈ తెగ అంటూ ఒకటి ఉందని 83 సంవత్సరాల క్రితం వరకూ ఈ ప్రపంచానికి తెలియనే తెలియదు.

కొంతమంది కాస్త చొరవ తీసుకొని, ఆ గిరిజన ఆచార వ్యవహారాలను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వారిని కలవగా ఇలాంటి వింత వింత ఆచారాలు వెలుగు చూశాయి.

ఈ తెగకు వున్న విచిత్రమైన ఆచారం ఏమిటంటే.

తమ బంధువులు, లేదా సొంత కుటుంబ సభ్యులు ఎవరన్నా మరణిస్తే.వారు ఆ మృతదేహాన్ని పూర్తిగా కాల్చరు.

Telugu Dani Tribe, Danitribe, Finger, Indonesia, Papun Guinea, Latest-Latest New

సగం కాల్చిన తరువాత ఆ మృతదేహాలను ఇంటిలోనే దాచుకుంటారు.అలాగే వీరి అత్యంత ప్రమాదకరమైన మరో ఆచారం ఏమిటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు.ఆ వ్యక్తి కుటుంబంలో ఉన్న స్త్రీ వేలుని కత్తిరిస్తారు.ఇలా ఒక్కసారి కాదు, చనిపోయిన ప్రతి సారీ ఇలా చేస్తారట.అంటే తమ ఇళ్లల్లోని కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడల్లా స్త్రీ ఒకొక్క వేలు కత్తిరించబడుతుందని అర్ధం.ఇకపోతే, డాని తెగ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేస్తూ.1965లో డెడ్ బర్డ్స్ అనే చిత్రాన్ని చిత్ర నిర్మాత రాబర్ట్ గార్డనర్ రూపొందించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube