ఆలస్యంగా వచ్చిందని ఆర్టీసీ బస్సుకు ఫైన్, ఎంతంటే?

ఆర్టసీ బస్సు నాలుగు గంటలు ఆలస్యంగా, గమ్య స్థానానికి చేర్చడంలోనూ మరో రెండు గంటలు జాప్యం చేయడం వల్ల ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది.దీంతో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది.టికెట్ డబ్బు రూ.631, పరిహారంగా రూ.1000, కేసు ఖర్చుల కింద మరో 500 రూపాయలు.మొత్తం 2, 131 రూపాయలను నెలన్నర రోజుల్లో చెల్లించాలని తెలిపింది.

 Fine For Tsrtc Bus For Coming For Four Hours , Fine For Tsrtc, Fine To Rtc, Tsrtc Latest News, Tsrtc Shocking News,fine For Tsrtc Bus-TeluguStop.com

అయితే 2019వ సంవత్సరం ఆగస్టులో హైదరాబాద్ కు చెందిన న్యాయవాది ఫహీమా బేగమ్..దిల్ సుఖ్ నగర్ నుంచి మణుగూరుకు ఆర్టీసీ బస్సులో టికెట్ బుక్ చేస్కుంది.బస్సు రాత్రి 7.15 గంటలకు ఉండగా… 11.15 గంటకు బస్టాండుకు వచ్చింది.దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చింది.అది చాలదన్నట్లు గమ్య స్థానానికి చేర్చడంలో కూడా చాలా లేటైంది.మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు బస్సు గమ్య స్థానానికి చేర్చాల్సి ఉండగా.9.45 కు చేర్చింది.ఎందుకు ఇంత ఆలస్యం అయిందని ఫహీమ డ్రైవర్ ను ప్రశ్నించగా.దురుసుగా మాట్లాడాడు.అంతే కాకుండా బస్టాండులో నాలుగు గంటల పాటు వేచి ఉండటం, బస్సు ప్రయాణం మరింత పెరగడంతో ఫహీమ అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఫహీమ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు.

 Fine For TSRTC Bus For Coming For Four Hours , Fine For Tsrtc, Fine To Rtc, Tsrtc Latest News, Tsrtc Shocking News,Fine For TSRTC Bus -ఆలస్యంగా వచ్చిందని ఆర్టీసీ బస్సుకు ఫైన్, ఎంతంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విచారించిన కమీషన్ ఆర్టీసీ బస్సు ఆలస్యం వల్లే ఫహీమ అస్వస్థతకు గైరనట్లు తేల్చింది.అందుకే తెలంగాణ ఆర్టీసీకి రూ.2, 131 జరిమానా విధించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube