సాధారణంగా చెప్పాలంటే ఆహారాల కంటే మాంసాహారం( non-vegetarian ) జీర్ణం అవ్వడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది.మనం తినేటప్పుడు హ్యాపీగా తిన్న అది త్వరగా జీర్ణం కాక, అవే త్రేన్పులు, గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.
చాలామందిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది.అందుకే మాంసాహారం తిన్న వెంటనే శీతల పానీయాలను( Soft drinks ) తాగుతూ ఉంటారు.
అయితే మాంసాహారం జీర్ణం అయ్యేందుకు ఎంత సమయం పడుతుందో,త్వరగా జీర్ణం కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఏ ఆహారం తిన్నా త్వరగా జీర్ణం చేసుకోగలరు.
వ్యక్తిని బట్టి ఆహారం జీర్ణం అయ్యే సమయం మారుతూ ఉంటుంది.మనం తినే మాంసాహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.
అందులో ప్రోటీన్లు, కొవ్వులు రెండు అధికంగా ఉంటాయి.అవి జీర్ణం కావాడనికి సుమారు రెండు నుంచి నాలుగు రోజుల వరకు సమయం పడుతుంది.
అందుకే ఎక్కువగా మాంసాహారం తిన్నప్పుడు మీకు రెండు నుంచి మూడు రోజుల వరకు కడుపులో ఏదోలా అనిపిస్తూ ఉంటుంది.
కొంతమంది అయితే నాన్ వెజ్ తిన్నాక మరసటి రోజు పెరుగన్నం మాత్రమే తింటూ ఉంటారు.ఇక జీర్ణశక్తి బాగా ఉంటే 24 గంటల్లోనే మాంసాహారం జీర్ణం అవుతుంది.మాంసాహారం త్వరగా జీర్ణం అవ్వడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మాంసారాన్ని కొందరు మార్కెట్ నుంచి తీసుకొని రాగానే శుభ్రం చేసి అలాగే వండుతారు.కానీ అలా కాకుండా దాన్ని సుమారు 6 నుంచి 8 గంటల పాటు మారినేట్ చేయాలి.
దీనివల్ల మాంసం మృదువుగా మారుతుంది.అప్పుడే త్వరగా ఉడుకుతుంది.
అలా వీలు కాకపోతే కనీసం రెండు, మూడు గంటలు అయినా మారినేట్ చేసేందుకు ప్రయత్నించండి.అలా కాకుండా మనం ఆహారాన్ని ఎక్కువసేపు నమిలితే జీర్ణ వ్యవస్థలో జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.
దీంతో ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.మాంసాహారం తిన్న తర్వాత పైనాపిల్ పండ్లను తింటే త్వరగా జీర్ణం అవుతుంది.
పైనాపిల్ పండ్లతో ఉండే బ్రొమెయిలిన్ అనే ఎంజైమ్ మాంసాహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.