చాణక్యుడు నీతి ప్రకారం సుగుణాల రాశి అయిన భార్య దొరికిన పురుషునికి జీవితంలో అన్ని రకాల ఆనందాలు లభ్యమవుతాయి.తెలివితేటలు కలిగిన భార్య తన భర్త విజయానికి చేయూతనందిస్తుంది.
అలాంటి భార్య తన భర్త విజయంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.అలాంటి మహిళలు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు.
కుటుంబంలోనూ, సమాజంలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు.తెలివితేటలు కలిగిన భార్య లక్షణాల గురించి చాణక్యుడు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపారు.
అవేమిటో ఇప్పుడు చూద్దాం.చాణక్య నీతి ప్రకారం పురుఫునికి భార్య మంచి సలహాదారు.
అందుకే ముఖ్యమైన విషయాల్లో భర్త తన భార్య సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
ఇలా చేసిన వారికి పనిలో విశేష విజయం లభిస్తుంది.
చాణక్య నీతి ప్రకారం, డబ్బు అందించే ప్రయోజనాన్ని అర్థం చేసుకున్న భార్య డబ్బు ఆదా చేస్తుంది కష్ట సమయాలు వచ్చినప్పుడు ఆ డబ్బుతో భర్తకు సహాయం చేస్తుంది.చాణక్య నీతి ప్రకారం డబ్బును పొదుపుగా ఖర్చుచేసేవారిపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.
ప్రతి మనిషి జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి.పురుషునికి కష్టకాలం వచ్చినప్పుడు అతని భార్య సామర్థ్యాన్ని పరీక్ష మొదలవుతుంది.
ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం పురుషునికి కష్ట కాలం ఎదురైనప్పుడు అతని భార్య, స్నేహితుడు, సేవకుడి నిజస్వరూపం బయటపడుతుంది.