ఆఖరికి అమెజాన్‌లో వున్న ఆ చెట్టును శాస్త్రవేత్తలు కనిపెట్టారు... దాని విశేషం ఇదే!

ఆ చెట్టు కోసం ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశ్రమిస్తున్నారు.ఆఖరికి ఆ చెట్టు ఉనికిని తెలుసుకున్నారు.

 Finally, The Scientists Discovered The Tree In The Amazon This Is Its Special Fe-TeluguStop.com

వివరాల్లోకి వెళితే, బ్రెజిలియన్ బ్రిటిష్ పరిశోధకుల బృందం 2019లో 3డీ మ్యాపింగ్ అధ్యయనంలో భాగంగా ఉపగ్రహ చిత్రాల్లో ఓ అత్యంత ఎత్తైన చెట్టును ఒకదానిని కనుగొనటం జరిగింది.దాంతో వారికీ ఆ చెట్టు మీద ఆసక్తి కలిగింది.

అప్పటినుండి ఎలాగైనా ఆ చెట్టు దగ్గరకు వెళ్లాలని, దాని గురించి వివరాలు సేకరించాలని అనుకున్నారు.ఈ క్రమంలో అక్కడకు భౌతికంగా వెళ్లి, ఆ చెట్టును చూసి తీరాలని పరిశోధకులు అనుకున్నారు.

అయితే తాజాగా వారు అనుకున్నది సాధించారు.ఆ చెట్టు అమెజాన్‌ రెయిన్‌ ఫారెస్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు.ఇక ఆ చెట్టు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నందున ఆ భారీ వృక్షాన్ని చేరుకోవడానికి వారికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టిందని, అంటే మూడేళ్ల ప్రణాళిక, 5 యాత్రలు, 2 వారాల పాటు ట్రెక్కింగ్ చేసి మరీ అక్కడికి చేరుకున్నామని తెలిపారు.అవును, ఈ ఏడాది సెప్టెంబర్ 17న శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఆ అమెజాన్ దిగ్గజాన్ని చేరుకోగలిగారు.

Telugu Amazon, Amazon Forest, Latest, Scientific, Tree-Latest News - Telugu

శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు ప్రకారం, ఆ చెట్టు 9.9 మీటర్లు అంటే 32 అడుగులు, చుట్టుకొలత 88.5 మీటర్లు అంటే 290 అడుగులు పొడవు కలిగి వుంది.అంటే మీరు ఊహించుకోండి.

ఈ చెట్టు అమెజాన్‌లో కనుగొనబడిన అతిపెద్ద చెట్టు కావడం విశేషం.ఏంజెలిమ్-వెర్మెల్హో అని కూడా పిలువబడే డినిజియా ఎక్సెల్సా చెట్టు 30-అంతస్తుల ఆకాశాన్ని కమ్మే విధంగా ఉంటుంది.

ఇది 400 ఏళ్ల నాటి పురాతనమైన చెట్టుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ఇలాంటి చెట్లను పర్యవేక్షించడం, దానిలో దాగున్న ప్రత్యేక లక్షణాలు, జరిగే పర్యావరణ ప్రక్రియలపై అ‍ధ్యయనం చేయనున్నట్లు శాస్తవేత్తల బృందం వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube