కొన్ని సినిమాలు చూసినపుడు మనం చాలాబాగా ఎంజాయ్ చేస్తాం అలాగే ఆ సినిమాలు కూడా చాలా మందికి నచ్చుతాయి కానీ కలెక్షన్స్ పెద్దగా రావు ఫైనల్ రిపోర్ట్ మాత్రం ప్లాప్ అని వస్తుంది…అట్లాంటి సినిమాలు ప్లాప్ అని విన్నప్పుడు ఈ మూవీ బాగానే ఉంటుంది కదా మనకు చాలా నచ్చిన సినిమా ఎందుకు ప్లాప్ అయింది అని అనుకుంటాం అలా ఎక్కువ జనాదరణ పొంది కూడా ప్లాప్ అయినా సినిమాలు ఏంటో ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాం…
జగడం

లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సెకండ్ మూవీ జగడం, ఆర్య తో సూపర్ హిట్ కొట్టిన సుక్కు ఈ సినిమా తో కూడా అదే రేంజు హిట్ వస్తుంది అనుకున్నాడు కానీ అయన అంచనా తారు మారు అయింది.అయినా కూడా ఈ సినిమాకి లక్షల్లో ఫాన్స్ ఉన్నారు హిందీ టీవీల్లో డబ్ అయినా ఈ సినిమాకి అక్కడ కూడా చాలా మంది ఫాన్స్ ఉన్నారు…దర్శకదీరుడు రాజమౌళికి కూడా ఈ సినిమా అంటే చాలా ఇష్టం అని చాలా సార్లు ఆయనే స్వయంగా చెప్పారు అలాగే ఈ సినిమాలో రౌడీ గ్యాంగ్ ని చూసి హీరో గ్యాంగ్ మొత్తం భయంతో వెనక్కి వస్తుంటే హీరో మాత్రం ఒక్కడే ఆలా దైర్యంగా నిలబడి ఉంటాడు ఈ సీన్ గురించి రాజమౌళి మాట్లాడుతూ ఈ సీన్ పవన్ కళ్యాణ్ కి కనుక పడితే సినిమా హిట్ అయ్యేది అలాగే మీరు కూడా టాప్ డైరెక్టర్ అయ్యేవారు అని సుకుమార్ తో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు…
ఖలేజా

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఖలేజా మూవీ చూసినంత సేపు అసలు బోరు కొట్టకుండా చాలా బాగుంటుంది మహేష్ బాబు చేసే కామెడీ కూడా అద్భుతంగా ఉంటుంది అయినా సినిమా ప్లాప్ అయింది.ఈ సినిమాకి నార్మల్ జనాలతోపాటు సెలబ్రిటీస్ లో కూడా చాలా మందే ఫాన్స్ ఉన్నారు ఒకప్పటి హీరోయిన్ అయినా ఇంద్రజ గారికి మరియు హీరో శివాజీ గారికి కూడా ఈ సినిమా అంటే చాలా ఇష్టమని వాళ్లే స్వయంగా చెప్పారు.అయినా కూడా ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా ప్లాప్ అనే అంటున్నారు అలాగే ప్రొడ్యూసర్స్ కి నష్టాలు తెచ్చిన సినిమా కానీ ఇప్పటికి ఈ సినిమాకి చాలా మంది అభిమానులు ఉన్నారు .
ప్రస్థానం
దేవాకట్టా డైరెక్షన్లో శర్వానంద్ హీరో గా సాయికుమార్ కీలక పాత్రలో నటించిన సినిమా ప్రస్థానం.( Prasthanam )సినిమాకు చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి కానీ సినిమా ఫైనల్ రిపోర్ట్ మాత్రం ప్లాప్ అనే చెప్తుంటారు శర్వానంద్ యాక్టింగ్ అయితే నిజం గా సూపర్ అనే చెప్పాలి సందీప్ కిషన్ కూడా ఈ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు…
వేదం

క్రిష్ డైరెక్షన్లో వచ్చిన వేదం( Vedam ) సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.ఈ సినిమాలో మన జీవితాలని మనమే చూసుకున్నట్టు ఉంటుంది ముఖ్యం గా అల్లు అర్జున్ ప్లే చేసిన కేబుల్ రాజు క్యారెక్టర్ అయితే నిజంగా సూపర్ అనే చెప్పాలి.ఈ సినిమాకి నంది అవార్డు వచ్చినప్పటికీ సినిమా అయితే ప్లాప్ అనే చెప్పాలి…
ఆరెంజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2 వ సినిమా అయినా మగధీర సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం మనకు తెలిసిందే అయితే బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఆరెంజ్( Orange ) సినిమా మాత్రం ప్లాప్ అయింది నాకు తెలిసి అప్పుడున్న జనాలు సినిమా అంటే ఇలానే ఉండాలి అనే ఒక మైండ్ సెట్ తో ఉండేవారు అందుకే వాళ్ళకి ఈ కంటెంట్ సరిగ్గా అర్థం కాలేదేమే అనుకుంట ఈ సినిమా గనక ఇప్పుడు వచ్చి ఉంటె పక్క హిట్ అయ్యేది…ఇవే కాకుండా వీటితోపాటు గా ఇంకొన్ని సినిమాలు కూడా ఉన్నాయి అవి సెకండ్ పార్ట్ లో చూద్దాం అలాగే మీకు బాగా నచ్చి ప్లాప్ అయినా సినిమాలు ఏంటో కింద కామెంట్ చేయండి…
.






