అనంతపురం జిల్లా ఉరవ కొండ నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకుల మధ్య అం తర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి.ఈ నియోజకవర్గంలో 2014లో విజయం సాధించిన విశ్వేశ్వరరెడ్డిగత ఎన్నికల్లో టికెట్ సంపాయించుకున్నా పరాజయం పాలయ్యారు.
సాధారణంగా ఈనియోజకవర్గంలో గెలుపుగుర్రం ఎక్కిన అభ్యర్థి ప్రాతినిధ్యం వహించే పార్టీ అధికారంలోకి రాదనే నానుడి ఉంది.ఇది నాను డే కాదు నిజం కూడా! ఇప్పటి వరకు ఇక్కడ ఎవరు గెలిచినా వారి పార్టీ అధికారంలోకి రావడం లేదు.
సరే ఈ విషయం ఎలా ఉన్నా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ తరపున ఇక్కడ ఇంచార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.అయితే ఈ క్రమంలో పార్టీ అభివృద్ధికి ఆయన కృషి చేస్తే మంచిదే.
కానీ సొంత పార్టీ నేతలతోనే డిష్యుం డిష్యు అంటూ ఆధిపత్య పోరుకు దిగుతున్నా రు.దీంతో ప్రధాన ప్రతిపక్షానికి చెక్ పెట్టాల్సిన అధికారపార్టీ నేతలే వీధిపడుతుండడంతో పార్టీ ఇబ్బందుల్లో పడిందనే వాదన వినిపిస్తోంది.

ఉరవకొండ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న విశ్వేశ్వరరెడ్డికి, మరో కీలక నాయకుడు శివరామిరెడ్డిల మధ్య ఆధిప త్య పోరు సాగుతోంది.తన మాటే నెగ్గాలనే ధోరణితో విశ్వేశ్వరరెడ్డి వ్యవహరిస్తుండడంతో శివరామిరెడ్డి ప్రత్యేకంగా గ్రూపు పెట్టుకున్నారు.దీంతో నియోజకవర్గంలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి.ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరుకు రెడీ కావడంతో ఇరువురి విషయం అధిష్టానం వద్దకు చేరి ఒకసారి ఇద్దరికీ వార్నింగ్ కూడా ఇచ్చారు.
కలిసి పనిచేయాలని ప్రదాన ప్రతిపక్షం టీడీపీకి చెక్ పెట్టేలా వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని కూడా పార్టీ అధిష్టానం సూచించింది.
అయితే అప్పటి వరకు ఓకే అన్న నాయకులు తర్వాత మాత్రం మళ్లీ రోడ్డెక్కారు.
ఓ కార్యక్రమంలో శివరామిరెడ్డి వర్గానికి చెందిన ఎంపీటీసీ అభ్యర్థిని అవమానించారని విశ్వేశ్వరరెడ్డిపై శివరామిరెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
తర్వాత స్థానిక గాలి మరల కంపెనీలో పనిచేసే ఉద్యోగుల విషయంలోనూ ఇరు నేతల మధ్య వివాదం రేగింది.ఇక, ఈ వివాదాల్లోకి అటు విశ్వేశ్వరరెడ్డి తనయుడు, శివరామిరెడ్డి తనయుడు కూడా జోక్యం చేసుకున్నారు.
దీంతో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.మొత్తానికి ప్రతిపక్షానికి చెక్ పెట్టాల్సిన నాయకులు తమలో తామే డిష్యుం.
డిష్యుం.చేసుకోవడం సరికాదనే సూచనలు వస్తున్నాయి.