ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలి: ప్రజా పందా పార్టీ పిలుపు

దశాబ్ది ఉత్సవాల పేట రాజకీయ లబ్ధి పొందేందుకు కేసిఆర్ ఆడుతున్న నాటకాలకు తెలంగాణ ప్రజలు విశ్వసించరని ప్రజా ఆకాంక్షలు ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ .ఆప్రజాస్వామిక పాలనతో ప్రజలను హింసిస్తున్నారని ,దీనిపై ప్రజలు ప్రజాస్వామ్యవాదులు పోరాడాలని సిపిఐ (ఎంఎల్) ప్రజా పంధా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రంగారావు పిలుపునిచ్చారు జూన్ 2 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఖమ్మం మయూరి సెంటర్లో గల అమరవీరులకు నివాళి అర్పించరు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ భజన చేయించుకోవడం తప్ప ఆత్మగౌరవం గురించి అవకాశాల గురించి ఆకాంక్షల గురించి అడిగితే నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని ఆయన అన్నారు,

 Fight For A Democratic Telangana Praja Pandha Party, Democratic Telangana, Praja-TeluguStop.com

ప్రాజెక్టులు కడతాను అన్న పేరిట లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి నిధులు తన కుటుంబానికి తీసుకొని నీళ్లను సముద్రం ఫాలో చేసిన ఘనత కెసిఆర్ ది అని ఆయన ఆరోపించారు .

కేసీఆర్ పాలనల్లో రాజ్యాంగ విలువలు కానీ రాజకీయ విలువల కానీ ఏమీ పాటించకుండా ఏకపక్షపాలన క కొనసాగిస్తున్నారని ప్రగతి భవన్లోకి ప్రజాప్రతినిధులను కానీ, సామాన్య ప్రజలు వెళ్లే అవకాశం లేకుండా వ్యవహరిస్తున్నారని.రైతాంగానికి రుణమాఫీ కౌలు రైతులకు పొడు రైతులకు పట్టాలు ,కేజీ టు పీజీ ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, డబల్ బెడ్రూంలో ఇళ్ల స్థలాలు దళితులకు మూడు ఎకరాల భూమి లాంటి పథకాలు తెలంగాణలో ఇప్పటివరకు కేసీఆర్ ప్రకటించిన రెండు ఎన్నికల్లో లబ్ధి పొందిన ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా 100% అమలు చేయకుండా

ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు.

తన అవినీతిని తన మోసాల్ని కప్పి పెట్టుకోవడం కోసం రాజకీయ లబ్ధి కోసమే దశాబ్ద ఉత్సవాలు పేరిట నాటకాలు ఆడుతున్నారని తెలంగాణ ప్రజలు ఆ నాటకాలకు గురికారని ,కేసీఆర్ తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు శివలింగం, మలిది నాగేశ్వరరావు, సివై పుల్లయ్య, జిరామయ్య ఆవుల అశోక్ శిరోమణి ఝాన్సీ మంగతాయ్ కే శ్రీను ఆజాద్ చందు రాకేష్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube