వైరల్ వీడియో: గాల్లో ఎగురుతున్న కాకిని అద్భుతంగా పట్టేసిన పిల్లి.. తర్వాతేమైందో చూడండి..

చిరుతపులులు తమ ఎరలను గాల్లోకి ఎగిరి మరీ పట్టుకోవడం కామన్.అదే జాతికి చెందిన పిల్లలు( Cats ) కూడా గాల్లో ఎగురుతున్న వాటిని వేటాడుతుంటాయి.

 Fierce Fight Between Cat And Crows Video Viral Details, Latest News, Viral News,-TeluguStop.com

తాజాగా ఒక క్యాట్ కొద్దిగా తక్కువ ఎత్తులో ఎగురుతున్న కాకిని( Crow ) అద్భుతంగా పట్టేసింది.తర్వాత ఇతర కాకులు పిల్లిని తరిమి తన తోటి కాకిని సంరక్షించుకునేందుకు ప్రయత్నించాయి.

ఇదే సమయంలో మరొక పిల్లి వాటిపై దాడి చేసింది.ఈ పిల్లులు, కాకుల మధ్య జరిగిన ఈ భీకర పోట్లాటను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాకిపై పిల్లి దాడి చేసిన తీరు చూసి చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు.చూసిన తర్వాత కూడా నమ్మలేకపోతున్నారు.ఈ వీడియోను @catto_loverss ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ షేర్ చేసింది.వీడియో క్యాప్షన్‌లో ‘పిల్లి, కాకి మధ్య పోరాటం.’ అని పేర్కొంది.27 సెకన్ల ఈ వీడియోలో కాకిని పట్టేందుకు ఓ పిల్లి చాలా సహనంగా నేలపై కూర్చోవడం చూడవచ్చు.అది అలా కాపు కాయగా సరిగ్గా అదే సమయంలో కాకి అటు వైపు ఎగురుతూ వచ్చింది.దీని గమనించిన పిల్లి వెంటనే గాలిలో( Cat Jump ) చాలా ఎత్తుకు దూకి కాకిని పట్టుకుంటుంది.

కొన్ని సెకన్లలో అవి రెండూ నేలమీద పడ్డాయి.పిల్లి పట్టు నుండి విడిపించుకోవడానికి కాకి చాలా కష్టపడుతుండగా.ఆ కాకిని కాపాడేందుకు మరో రెండు కాకులు అక్కడికి చేరుకున్నాయి.తోటి కాకిని విడిపించేందుకు పిల్లిని పొడిచేస్తూ దాడి చేయడం ప్రారంభించాయి.ఒక కాకి పిల్లి వెనుక భాగాన్ని తన ముక్కుతో బలంగా పొడవడంతో అది ఉలిక్కిపడి అక్కడ నుంచి పారిపోయింది.అలా ఆ కాకులు ఆ పిల్లిని తరిమికొట్టడంలో విజయం సాధించినప్పటికీ, మరొక పిల్లి సడన్‌గా ఎంట్రీ ఇచ్చి కిందపడి ఉన్న ఆ కాకిని పట్టుకుని దానితో పారిపోతుంది.

ఈసారి కాకులు రెండూ తమ తోటి కాకిని కాపాడుకోవడంలో సఫలం కాలేదు.

రీసెంట్‌గా పోస్ట్ చేసిన ఈ వీడియోకు 10 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.ఈ వీడియో చూసిన చాలా మంది కాకిపై పిల్లి దాడి( Cat Attack Crow ) చేసిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోందంటూ కామెంట్లు చేశారు.‘ప్రారంభంలో పిల్లి దూకి కాకిని పట్టుకున్న తీరు చూసేందుకు చాలా అద్భుతంగా ఉంది’ అని ఒక నెటిజెన్ కామెంట్ పెట్టాడు.‘పిల్లులు చాలా తెలివైనవి.ఎప్పుడు వెనక్కి తగ్గాలో వాటికి తెలుసు.’ అని ఇంకోసారి ఫన్నీగా వ్యాఖ్యానించాడు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube