కూటమి పార్టీల్లో క్రాస్ ఓటింగ్ భయం ?

టిడిపి, జనసేన, బిజెపిలు ఏపీలో కూటమిగా ఏర్పడ్డాయి.వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.

 Fear Of Cross-voting In Coalition Parties, Janasena, Bjp, Tdp, Pavan Kalyan, Jan-TeluguStop.com

ఈ మూడు పార్టీలు పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు ఇప్పటికే పూర్తి చేసుకున్నాయి.నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో, ఆ హడావుడిలో ఉన్నారు.

అయితే ఈ మూడు పార్టీలకు క్రాస్ ఓటింగ్ భయం తీవ్రంగా ఉంది.దీనికి కారణం టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్థులు ఉమ్మడిగా చాలాచోట్ల ప్రచారాన్ని నిర్వహించకపోవడమే కారణం.

శాసనసభ కు పోటీ చేస్తున్న అభ్యర్థులు కేవలం తాము పోటీ చేసే స్థానం విషయం గురించే ప్రజలకు వివరిస్తూ, తమ పార్టీ గుర్తుని ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Cross, Fear Cross, Jagan, Janasena, Janasenani, Pavan Ka

పొత్తులో భాగంగా ఎంపీ స్థానాల్లో వేరే పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా.ఆ గుర్తు గురించి ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారం నిర్వహించకపోవడం పై మూడు పార్టీల్లోనూ గందరగోళం నెలకొంది.అయితే రెండు గుర్తులను ప్రచారం చేస్తే ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు గుర్తు గురించి ప్రచారం చేయకపోవడం తో ఈ కూటమి పార్టీల్లో కొత్త ఆందోళనకు తెరతీసింది.

ఇదే పరిస్థితి కొనసాగితే పోలింగ్ సమయంలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని, దీని కారణంగా మూడు పార్టీలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందనే భయం వారిని వెంటాడుతోంది.దీనిపై అలర్ట్ అయిన మూడు పార్టీల అధిష్టానాలు అభ్యర్థులకు ఫోన్ చేసి మరి సూచనలు చేస్తూ.

ఖచ్చితంగా మిత్రపక్షం పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్నికల గుర్తు గురించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని చెబుతున్నారట.

Telugu Ap Cm Jagan, Ap, Cross, Fear Cross, Jagan, Janasena, Janasenani, Pavan Ka

Aమూడు పార్టీలలో ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తుండడంతో, క్రాస్ ఓటింగ్ జరిగితే జరిగే నష్టం తీవ్రంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.ఎన్నికల ఫలితాల్లో శాసనసభ నియోజకవర్గాల్లో ఒక పార్టీ అభ్యర్థి గెలిచి, పార్లమెంట్ కు పోటీ చేసిన కూటమి అభ్యర్థి ఓడిపోతే, క్రాస్ ఓటింగ్ జరిగిందనే విషయం స్పష్టంగా తేలిపోతుంది.అది తమకు భవిష్యత్తులో తలనొప్పిగా మారుతుందని మూడు పార్టీల అధిష్టానాలు ఆందోళన చెందుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube