ఛత్తీస్గఢ్లో( Chhattisgarh ) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.దుర్గ్ జిల్లాలో ప్రైవేట్ కంపెనీ బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది.
ఈ ప్రమాదంలో 12 మంది మృత్యువాత పడగా.మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బస్సులో ప్రయాణిస్తున్న వారంతా కెడియా డిస్టిల్లరీకి( Kedia Distillery ) చెందిన సిబ్బందిగా పోలీసులు గుర్తించారు.విధులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం.
మరోవైపు ప్రమాద బాధితులను డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఆస్పత్రిలో పరామర్శించారు.అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.