ఏపీలో రైతుల పోరుబాట ఆగదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.తణుకు సభ తరువాత మరో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని చెప్పారు.
సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన ప్రకటన హర్షణీయమన్నారు.
పవన్ వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు.బీజేపీని తమ కూటమిలోకి తెచ్చేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
పవన్ ప్రకటన నేపథ్యంలో వైసీపీ నేతలు వణికిపోతున్నారని వెల్లడించారు.ఈ ఎన్నికల వరకు జనసేనతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు.