ధాన్యం సేకరణ వేగంగా పూర్తి చేయడంపై రైతుల హర్షం

రాజన్న సిరిసిల్ల జిల్లా : తమ గ్రామంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సేకరించి ఖాతాల్లో డబ్బులు వేయించిన జిల్లా అధికారులకు నేరెళ్ల రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

కొనుగోలు వేగంగా పూర్తి చేయడంపై హర్షం వారు వ్యక్తం చేశారు.

తంగళ్లపల్లి మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పరిశీలించారు.తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్ల, బస్వాపూర్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అలాగే పలు రైస్ మిల్లులు పరిశీలించారు.

కొనుగోలు కేంద్రాల్లో రిజిస్టర్లు తనిఖీ చేశారు.కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని, కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ట్యాబ్ ఎంట్రీ చేయాలని నిర్వాహకులకు సూచించారు.

తరలింపు కోసం లారీలు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా రైతులు అతను కలెక్టర్ తో మాట్లాడారు.

Advertisement

ఇక్కడ జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జితేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News