తెలుగు సినీ ప్రేక్షకులకు యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జాతి రత్నాలు సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది ఫరియా అబ్దుల్లా.
ఈ సినిమాలో ఆమె అందం అభినయం నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ సినిమా తర్వాత ఫరియా అబ్దుల్లాకి వరుసగా అవకాశాలు వస్తాయి అని అందరూ భావించారు.
కానీ ఊహించిన విధంగా ఈమెకు అవకాశాలు మాత్రం రాలేదు.అయితే అవకాశాలు రాకపోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం తగ్గలేదు.
ఇది ఇలా ఉంటే ఫరియా అబ్దుల్లా తాజాగా నటించిన చిత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు.
మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది.
ఈ సినిమా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా ట్రావెలింగ్ నేపథ్యంలో ఉంటుంది అని తెలిపింది.

ఆ సినిమాలో తన పాత్రలో చాలా మలుపులు ఎత్తు పల్లాలు కూడా ఉంటాయి అని వెల్లడించింది ఫరియా అబ్దుల్లా.జాతి రత్నాలు సినిమా తర్వాత కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలో కనిపించాను.కానీ హీరోయిన్ గా మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా రెండవది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని చాలా ఎక్సైటింగ్ గా ఉంది అని తెలిపింది ఫరియా అబ్దుల్లా.
జాతి రత్నాలు సినిమా మాదిరిగానే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని నమ్మకం ఉంది అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది ఫరియా అబ్దుల్లా.ఇక ఎటువంటి సినిమాలు నటించాలి ఉంది అన్న ప్రశ్న పై స్పందించిన ఫరియా అబ్దుల్లా.
లిమిటేషన్లు ఏమీ లేవు.యాక్షన్, సూపర్ నేచురల్, సైకో థ్రిల్లర్స్ ఇలా అన్నీ పాత్రలు చేయాలని వుంది.
అయితే ఏ పాత్రని చేసిన రిలేటిబుల్ గా వుండాలి అని చెప్పుకొచ్చింది మన జాతి రత్నాలు బ్యూటీ.







