ఇండియన్ తొలి వ్యోమగామి రాకేష్ శర్మ గా ఫర్హాన్ అక్తర్

ఈ మధ్యకాలంలో వెండితెరపై బయోపిక్ ల ట్రెండ్ ఎక్కువైంది.సౌత్ సినిమాల నుంచి హిందీ వరకు అన్ని భాషలలో ఈ నిజ జీవిత కథలకి మంది డిమాండ్ ఏర్పడింది.

 Farhan Akhtar To Play Rakesh Sharma In The Biopic, Bollywood, Mahesh Matha, Saar-TeluguStop.com

దీంతో ఇండియాలో సక్సెస్ ఫుల్ వ్యక్తుల జీవితాలని తెరపై ఆవిష్కరించేందుకు దర్శక, నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.మొన్నటి వరకు క్రీడాకారుల జీవితాలని తెరపై ఆవిష్కరించిన దర్శకులు, ఇప్పుడు ఇతర రంగాలలో కూడా క్రింది స్థాయి నుంచి ఉన్నత స్థానాలకి ఎదిగిన వారి జీవితాలపై పరిశోధన చేసి వాటికి దృశ్యరూపం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఈ నేపధ్యంలో రీసెంట్ గా శంకుంతలాదేవి బయోపిక్ విద్యాబాలన్ టైటిల్ రోల్ లో వచ్చింది.ఇక ఇండియన్ ఫస్ట్ మహిళా ఎయిర్ ఫైటర్ అయిన గుంజన్ సక్సేనా జీవిత కథతో జాన్వీ కపూర్ టైటిల్ రోల్ లో సినిమా వస్తుంది.

అలాగే అబ్దుల్ కలాం బయోపిక్ కి కూడా రంగం సిద్ధం అవుతుంది.అలాగే ఇతర రంగాలలో నిష్ణాతులైన వారి కథలని జల్లెడ పడుతున్నారు.

ఈ నేపధ్యంలో అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన రాకేశ్‌ శర్మ జీవితం ఆధారంగా ఓ బయోపిక్‌ని రూపొందించేందుకు బాలీవుడ్‌లో సన్నాహాలు మొదలయ్యాయి.అయితే రాకేశ్‌ శర్మగా తొలుత అమీర్‌ఖాన్‌ నటించబోతున్నట్టు వార్తలొచ్చాయి.

ఆ తర్వాత షారూఖ్‌ ఖాన్‌ చేస్తున్నట్టు కూడా సోషల్‌ మీడియాలో పలు వార్తలు హల్‌చల్‌ చేశాయి.అయితే తాజా అప్‌డేట్‌ ప్రకారం ఈ బయోపిక్‌లో ఫర్హాన్‌ అక్తర్‌ నటించనున్నట్టు తెలుస్తోంది.

మహేష్‌ మథారు దర్శకత్వం వహించబోయే ఈ చిత్రానికి సారే జహాసే అచ్ఛా అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు.ఇప్పటికే ఫర్హాన్ అక్తర్ బాగ్ మిల్కా సింగ్ బయోపిక్ లో గతంలో నటించి సూపర్ హిట్ కొట్టాడు.

ఇప్పుడు మరోసారి ఓ ప్రముఖ వ్యక్తిగా ఉన్న రాకేశ్ శర్మ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి రెడీ అవుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube