NTR ,Rishabh Shetty : ఎన్టీఆర్ రిషబ్ శెట్టి కాంబోలో సినిమా కావాలంటున్న ఫ్యాన్స్.. ఇండస్ట్రీ హిట్ గ్యారంటీ అంటూ?

సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్లకు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొన్ని కాంబినేషన్లు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తాయని విడుదలకు ముందే అర్థమవుతుంది.

 Fans Requested Ntr Rishab Shetty Combo Details Here Goes Viral In Social Media-TeluguStop.com

అలా ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న క్రేజీ కాంబినేషన్లలో ఎన్టీఆర్ , రిషబ్ శెట్టి( NTR, Rishabh Shetty ) కాంబినేషన్ కూడా ఒకటి.ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మధ్య మంచి అనుబంధం అయితే ఉందనే సంగతి తెలిసిందే.

రిషబ్ శెట్టి నటుడు, దర్శకుడు అనే సంగతి తెలిసిందే.విలువలను పాటించి సినిమాలను తీసే రిషబ్ శెట్టి ఎంచుకునే కాన్సెప్ట్ ల విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎన్టీఆర్, రిషబ్ శెట్టి కలిసి నటించినా ఓకేనని లేదా ఎన్టీఆర్ హీరోగా రిషబ్ శెట్టి డైరెక్షన్ లో సినిమా వచ్చినా పరవాలేదని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఎన్టీఆర్, రిషబ్ శెట్టి ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Telugu Devara, Fansntr, Kollywood, Kundapur, Rishabh Shetty, Tollywood-Movie

రిషబ్ శెట్టి సొంతూరు, జూనియర్ ఎన్టీఆర్ తల్లి సొంతూరు కుందాపూర్ ( Kundapur )కావడంతో ఈ ఇద్దరు హీరోల మధ్య స్నేహ బంధం ఉందని టాక్ ఉంది.కర్ణాటక రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది.తారక్ సినిమాలు అక్కడ కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయి.జూనియర్ ఎన్టీఆర్ కన్నడలో సైతం అలవోకగా మాట్లాడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Telugu Devara, Fansntr, Kollywood, Kundapur, Rishabh Shetty, Tollywood-Movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర ( Devara )సినిమాలో నటిస్తుండగా దేవర అక్టోబర్ 10వ తేదీన డేట్ ను ఫిక్స్ చేసుకుంది.దసరా కు దేవర విడుదలై సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.గతేడాది దసరాకు బాలయ్య భగవంత్ కేసరి హిట్ కాగా ఈ ఏడాది దసరాకు దేవర కలెక్షన్ల రికార్డ్ లను క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది.పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube