ఏపీలో టెట్, డీఎస్సీ పరీక్షల అంశం( TET,DSC Exams Oపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.టెట్ మరియు డీఎస్సీ పరీక్షల మధ్య కనీసం నాలుగు వారాల సమయం ఉండాలని న్యాయస్థానం వెల్లడించింది.
ఈ నెల 15వ తేదీ నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ ను హైకోర్టు( High Court ) సస్పెండ్ చేసింది.ఈ నెల 14న టెట్ పరీక్ష ఫలితాలు వస్తున్నాయని, ఈ నెల 15 నుంచి డీఎస్సీ పరీక్షలు( DSC Exams ) నిర్వహించడంపై హైకోర్టులో విద్యార్థులు పిటిషన్లు దాఖల చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం డీఎస్సీ షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది.