అర్షదీప్ సింగ్ పై ఫ్యాన్స్ ఫైర్.. పరమ చెత్త బౌలర్ అంటూ కామెంట్స్..!

భారత్-ఐర్లాండ్( Arshdeep Singh ) తోలి టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 139 పరుగులను నమోదు చేసింది.

 Fans Fire On Arshdeep Singh .. Comments Saying He Is The Worst Bowler..! , Irel-TeluguStop.com

మ్యాచ్ ఆరంభం నుండే ప్రత్యర్థి బ్యాటర్లను భారత పేసర్లు తెగ ఇబ్బంది పెట్టారు.దాదాపుగా ఒక ఏడాది పాటు జట్టుకు దూరంగా ఉండి తాజాగా రీఎంట్రీ ఇచ్చిన జస్ప్రీత్ బుమ్రా( Jasprit Bumrah ) తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు.

ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.ప్రసిద్ధ్ కృష్ణ కూడా తన తోలి టీ20 మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు.

స్పిన్నర్ రవి బిష్ణోయి కూడా రాణించాడు.కానీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆర్షదీప్ సింగ్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

ఇతను డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ఎలా అవుతాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.సోషల్ మీడియా వేదికగా అర్షదీప్ పేలవ ప్రదర్శన పై ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

Telugu Arshdeep Singh, Barry Mccarthy, India, Ireland, Jasprit Bumrah, Latest Te

ఈ మ్యాచ్ లో 20వ ఓవర్ అర్షదీప్ సింగ్ బౌలింగ్ చేసి ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు.ఐర్లాండ్ 8వ నెంబర్ బ్యాటర్ మెకార్తీ( Barry mccarthy ) చెలరేగి పరుగులు చేశాడు.ఫ్యాన్స్ వీడేక్కడి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అంటూ కోపంతో విమర్శకు కామెంట్లు చేస్తున్నారు.ఈ మ్యాచ్ లో ఏకంగా 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీసుకున్నాడు.

అయితే డెత్ ఓవర్ లో పేలవ ప్రదర్శన చేయడం అర్షదీప్ సింగ్ కు కొత్తేమీ కాదు.

Telugu Arshdeep Singh, Barry Mccarthy, India, Ireland, Jasprit Bumrah, Latest Te

ఇటీవలే జరిగిన వెస్టిండీస్( West Indies ) టీ20 సిరీస్ నాలుగో మ్యాచ్లో 19 ఓవర్ వేసిన ఆర్షదీప్ సింగ్ ఏకంగా 17 పరుగులు సమర్పించుకున్నాడు.ఆ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడం వల్ల దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.కానీ ఇలాగే కంటిన్యూ చేస్తే భారత్ గెలిచే మ్యాచ్లలో కూడా ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ.

సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు వేస్ట్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ఆర్షదీప్ అంటూ విమర్శకు కామెంట్లు చేస్తూ, ట్రోలింగ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube