ప్రముఖ నటుడు కృష్ణ భార్యగా, నటిగా, దర్శకురాలిగా విజయనిర్మల ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించారు.ప్రముఖ నటి జయసుధకు విజయనిర్మల పిన్నమ్మ కావడం గమనార్హం.
ఈమె అసలు పేరు నిర్మల కాగా విజయా స్టూడియోలో తొలి అవకాశం దక్కడంతో ఆమె తన పేరును విజయనిర్మలగా మార్చుకున్నారు.బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విజయనిర్మల తర్వాత రోజుల్లో అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు.
2002 సంవత్సరంలో ఎక్కువ సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించిన మహిళగా విజయనిర్మలకు గుర్తింపు దక్కింది.కృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలలో విజయనిర్మల నటించగా ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు విజయం సాధించాయి.50కు పైగా సినిమాలలో కృష్ణ, విజయనిర్మల జంటగా నటించారు.2019 సంవత్సరం జూన్ నెల 27వ తేదీన అనారోగ్య సమస్యల వల్ల విజయనిర్మల మృతి చెందారు.
ప్రముఖ నిర్మాత ఎన్.వి.సుబ్బరాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కృష్ణ, విజయనిర్మల పెళ్లి టెంపుల్ లో జరిగిందని పేర్కొన్నారు.

ఆ పెళ్లి జరిగే సమయంలో జగత్ కిలాడీలు మూవీ నిర్మాతలు అక్కడికి వెళ్లారని సుబ్బరాజు చెప్పుకొచ్చారు.విజయనిర్మల గారు ఎప్పుడు వెళ్లినా గౌరవంగా చూసేవారని సుబ్బరాజు అన్నారు.ఆ తర్వాత నరేష్, భానుచందర్ తో యమదూతలు సినిమా తీస్తే బాగుంటుందని విజయనిర్మలకు చెప్పానని సినిమా చేయమని ఆమె చెప్పారని సుబ్బరాజు వెల్లడించారు.

ఆ సమయంలో నరేష్ డేట్ల విషయంలో సమస్య రాగా విజయనిర్మల పరిష్కరించారని ఆవిడ చేసిన మేలును మరిచిపోలేనని సుబ్బరాజు చెప్పుకొచ్చారు.తన సహాయం ఎప్పుడూ ఉంటుందని ఆమె చెప్పారని సుబ్బరాజు చెప్పుకొచ్చారు.విజయనిర్మల తన సినీ కెరీర్ లో ఎంతోమందికి సహాయం చేశారు.నరసరావుపేట ఈమె సొంతూరు కాగా చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి విజయనిర్మల చెన్నైకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.







