Kcr , Dilraju : కేసీఆర్ ని కలిసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు..!!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ( Dilraju )మాజీ సీఎం కేసీఆర్ ( kcr )నీ కలవడం జరిగింది.శనివారం ఆయన నివాసంలో కేసీఆర్ తో భేటీ అయి తన తమ్ముడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశీష్ రెడ్డి వివాహానికి రావలసిందిగా ఆహ్వాన పత్రిక అందజేశారు.

 Famous Producer Dil Raju Met Kcr-TeluguStop.com

ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడిపోవడం తెలిసిందే.

ఈ ఘటనలో తుంటి ఎముక విరగడంతో యశోద ఆసుపత్రిలో( Yashoda Hospital ) చికిత్స కూడా చేయడం జరిగింది.హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేసిన వైద్యులు ఎనిమిది వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

దీంతో మొన్నటి వరకు ఇంటిలోనే విశ్రాంతి తీసుకున్న కేసీఆర్.కొద్ది రోజుల క్రితం ప్రత్యక్ష రాజకీయాలలో అడుగుపెట్టడం జరిగింది.ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు.ఈ క్రమంలో మెల్లమెల్లగా కోలుకుంటున్నరు.తెలంగాణలో మరో రెండు నెలలలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలకు సంబంధించి ఇటీవల పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కూడా నిర్వహించటం జరిగింది.

అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందటంతో ఈ పార్లమెంట్ ఎన్నికలను కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube