స్కిల్ డెవలప్మెంట్( Skill development ) కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నందు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.చంద్రబాబు అరెస్ట్ అయి జైల్ లో దాదాపు 30 రోజులకు పైగా ఉంటూ వస్తున్నారు.
ఇటీవల డిహైడ్రేషన్ కారణంగా అనారోగ్యం పాలు కావడం జరిగింది.ఆ తర్వాత స్కిన్ ఎలర్జీతో కూడా బాధపడ్డారు.
దీంతో చంద్రబాబు( Chandrababu naidu ) ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా నారా కుటుంబ సభ్యులు ఎంతో మనోవేదనకు గురయ్యారు.చంద్రబాబుకి జైలో ఏదైనా జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కామెంట్లు కూడా చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా చంద్రబాబు ఆరోగ్య నివేదికలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును లోకేష్ ( Nara lokesh )ట్విట్టర్ లో ఎండగట్టారు.“అక్రమ అరెస్టు చేసి, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, జ్యుడీషియల్ రిమాండ్ లోనే చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని కుట్ర చేస్తున్నారు.జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించినా, తప్పుడు నివేదికలు ఇస్తూ, అంతా బావుందని ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోంది.న్యాయానికి ఇంకెన్నాళ్లు ఈ సంకెళ్లు అని నినదిస్తూ నేను, బ్రాహ్మిణి హైదరాబాద్ నివాసంలో నిరసన తెలిపాము” అని ట్వీట్ చేయడం జరిగింది.
మరోపక్క చంద్రబాబు త్వరగా బయటికి రావాలని తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంకా ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల తెలుగుదేశం పార్టీ అభిమానించే వాళ్ళు ఐటీ ఉద్యోగులు కూడా నిరసనలు తెలియజేస్తున్నారు.







