ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం లేదని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు అన్నారు.ఇది సౌత్ ఇండియా వ్యాపారులపై నార్త్ ఇండియా చేసిన కుట్రని తెలిపారు.
కుట్రలో భాగంగానే ఛార్జ్ షీట్ లో తమ పేర్లు చేర్చారని పేర్కొన్నారు.తనకు, తన కుమారుడికి సౌత్ గ్రూప్ లో ఎలాంటి షేర్లు లేవని చెప్పారు.
వ్యాపారవేత్త అమిత్ అరోరాతో తాను కానీ,తన కుమారుడు కానీ ఎప్పుడు మాట్లాడలేదని తెలిపారు.తప్పుడు ఆరోపణలపై గతంలో కూడా వివరణ ఇచ్చినట్టు వెల్లడించారు.
త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అన్నీ వివరిస్తానని స్పష్టం చేశారు.