డబ్బు సంపాదించడం కోసం ఎన్నో మంచి మార్గాలు ఉన్నాయి.కానీ అత్యాశకు పోయి అడ్డదారులలో సంపాదించి లగ్జరీ లైఫ్ జీవించాలనే ఉద్దేశంతో ఎన్ని దారుణాలు చేసినా చివరికి ఏదో ఓచోట చేసిన చిన్న తప్పు కారణంగా అడ్డంగా దొరికి పోవాల్సిందే.
ఆ చిన్న తప్పే నిందితుల బాగోతాలను బట్టబయలు చేసేస్తుంది.ముంబైలో ఇలాంటి కోవకు చెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళితే.ముంబైలోని రాజోడి బీచ్( Rajodi Beach in Mumbai ) లోని ఓ ఇంటి కి ప్రతిరోజు ఉదయం 50 మందికి సరిపడే బ్రేక్ఫాస్ట్, టీ లు ఆన్లైన్ ఆర్డర్ ద్వారా వెళ్తున్నాయి.
ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల సమయంలో పెద్ద ఎత్తున ఫుడ్ ఆర్డర్స్ వస్తు ఉండడంతో పోలీసులకు కాస్త అనుమానం కలిగింది.అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం కొన్ని రోజులపాటు పోలీసులు నిఘా పెట్టి, సోదాలు నిర్వహించడంతో నకిలీ కాల్ సెంటర్ బాగోతాలు బయటపడ్డాయి.

ఆ నకిలీ కాల్ సెంటర్ లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆస్ట్రేలియాలోని ( Australia )వినియోగదారులకు ఫోన్ కాల్స్ ద్వారా ఏమార్చి వారి బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వ్యవహారాలు సేకరిస్తున్నారు.వారంతా నైట్ షిఫ్ట్ చేస్తూ ఉండడంతో తెల్లవారుజామున ఫుడ్ ఆర్డర్స్ వెళ్ళేవి.ముంబై నగరంలోని రాజోడి బీచ్ ప్రాంతం వారాంతరాల్లో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.

మిగతా రోజుల్లో అయితే నిర్మానుషంగా ఉంటుంది.కానీ ప్రతిరోజు 50 మందికి పైగా సరిపడే ఫుడ్ ఆర్డర్స్ వస్తూ ఉండడంతో నిఘా పెట్టి, ఫుడ్ ఆర్డర్ డెలివరీ అవుతున్న సమయంలో రైడ్ చేశారు పోలీసులు.అందులో సుమారుగా 50 నుంచి 60 మంది ఉద్యోగులు రాత్రి వేళల్లో పని చేస్తున్నారు.
వారందరికీ టెలి కాలింగ్ లో శిక్షణ ఇచ్చి ఆస్ట్రేలియాలోని వినియోగదారులను ఏ మార్చి వారిని బ్యాంకు ఖాతా వివరాలు ఓటిపి వివరాలు తెలుసుకొని కాల్ సెంటర్ మేనేజర్లకు మెయిల్ ద్వారా మీరు సేకరించిన వివరాలు అన్ని పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.అక్కడ ఉండే కంప్యూటర్లు, ల్యాప్టాప్ లను ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపించామని పోలీసులు తెలిపారు.







