బుల్లితెర కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఫైమా ( Faima ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.లేడీ కమెడియన్ గా బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం బిగ్ బాస్ ( Bigg Boss ) అవకాశాన్ని అందుకున్నారు.
బిగ్ బాస్ కార్యక్రమంలో కొన్ని వారాలపాటు తన పంచ్ డైలాగులతో అందరినీ ఎంతో సందడి చేసినటువంటి ఈమె ఈ కార్యక్రమం అనంతరం స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఫైమా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే ఈమె పటాస్ ప్రవీణ్ ( Patas Praveen ) అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయాన్ని పలు సందర్భాలలో బయటపెట్టారు.ఇక వీరిద్దరూ కలిసి తమ యూట్యూబ్ ఛానల్ లో చేసే హంగామా కూడా మామూలుగా ఉండదు.బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన తర్వాత ఫైమా రేంజ్ భారీగా పెరిగిపోయింది దీంతో ఈమె ప్రవీణ్ ను పెళ్లి చేసుకుంటుందా అన్న సందేహం అందరిలోనూ కలిగింది.
అయితే తాజాగా ఈమె అందరూ అనుకున్నట్టుగానే ప్రవీణ్ కి బ్రేకప్ ( Break Up ) చెప్పి మరో వ్యక్తితో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటూ ఫైమా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలు ఫైమా ప్రవీణ్ బ్రేకప్ చెప్పుకోవడం ఏంటి అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే…ఫైమా, ప్రవీణ్ కలిసి ‘బేబి’ స్ఫూఫ్ చేశారు.ఇలా స్ఫూఫ్ వీడియోను చేయడం వరకూ బాగానే ఉంది.కానీ, ఆమె వేరే వ్యక్తితో పెళ్లికి రెడీ అయినట్లు కూడా ఇందులో ఓ పోస్టర్ వేశారు.
అయితే అందులో ఉన్నటువంటి వ్యక్తి ఫోటో కావాలనే ఫోటోషాప్ ద్వారా మార్చేసారని తెలుస్తోంది.ఏదిఏమైనా ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.అయితే ఇదంతా కూడా బేబీ సినిమా(Baby Movie) ప్రమోషన్లలో భాగమేనని తెలుస్తోంది.