ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం పుష్ప( Pushpa ) ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ అయిందో మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ ( Fahadh Faasil ) నటించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా క్లైమాక్స్ లో ఈయన పాత్ర హైలెట్ గా మారింది.ఇక సీక్వెల్ సినిమాలో ఈయన పాత్ర మరింత హైలెట్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
ఇలా పలు సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ మరోవైపు హీరోగా కూడా నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా ఫహద్ ఫాసిల్ నటించిన ఆవేశం అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.అయితే ఒక ఇంటర్వ్యూలో భాగంగా పుష్ప సినిమా గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
పుష్ప 2లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ ఈ సీక్వెల్స్ సినిమాలో నా పాత్ర క్రూరంగా ఉంటుందని, అతి భయంకరంగా ఉంటుందని నేను చెప్పను కానీ చాలా విభిన్నంగా ఉంటుందని తెలిపారు.
ఈ క్రమంలోనే మరో ప్రశ్న కూడా ఈయనకు ఎదురైంది.ఈమధ్య విలన్ పాత్రలు ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతున్నాయి.ఈక్రమంలోనే పుష్ప సినిమాలో ఫహాద్ చేసిన విలన్ రోల్ హీరో పాత్ర కంటే ఎక్కువుగా ఆడియన్స్ కి రీచ్ అయ్యాయి.ఇది మీరు ఎలా తీసుకుంటున్నారనే ప్రశ్న ఎదురు కాగా ఈ సినిమాలో నాకంటే అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉందని తెలిపారు.
అల్లు అర్జున్ పాత్ర, అతని మ్యానరిజమ్స్ ఎక్కువ పాపులారిటీని సంపాదించుకోవడంతో ఏకంగా ఆయనకు నేషనల్ అవార్డు( National Award ) వచ్చింది అంటూ ఈ సందర్భంగా ఫహద్ ఫాసిల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.