పుష్ప 2 కొత్త అప్‌డేట్‌.. భన్వర్ సింగ్ షెకావత్ ఎంట్రీ ఇచ్చాడోచ్‌

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా యొక్క చిత్రీకరణ స్పీడ్ గా జరుగుతుంది.మొదటి షెడ్యూల్ వైజాగ్ లో నిర్వహించిన విషయం తెలిసిందే.

 Fahadh Faasil Bhanwar Singh Shekhawat Joins Pushpa2 Shooting,fahadh Faasil, Push-TeluguStop.com

అక్కడ చిత్రీకరణలో కేవలం అల్లు అర్జున్ మాత్రమే పాల్గొన్నారు.అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు సుకుమార్ ఆ తర్వాత హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో మరియు శివారు ప్రాంతంలో చిత్రీకరణ మొదలు పెట్టాడు.

రెండవ షెడ్యూల్ లో కూడా అల్లు అర్జున్ పాల్గొన్నారు.అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంది.

అల్లు అర్జున్ కాంబినేషన్స్ సన్నివేశాలు పూర్తి అయిన తర్వాత ఫాహద్ ఫాసిల్‌ పై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.

పుష్ప 2 సినిమా లో ఈ మలయాళ నటుడు ఫాహద్ ఫాసిల్‌ బన్వర్ సింగ్ షెకావత్ ఐపీఎస్‌ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.మొదటి భాగంలో ఈయన పాత్ర కు ఎక్కువగా స్కోప్ దక్కలేదు.కానీ అల్లు అర్జున్ కి ధీటైన పాత్రలో పుష్ప రెండవ భాగంలో ఈయన కనిపించబోతున్నాడని చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా బలంగా చెబుతున్నారు.

ఫాహద్‌ పై కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ రూపొందిస్తున్నట్లుగా మేకర్స్‌ పేర్కొన్నారు.ఫాహద్‌ మాత్రమే కాకుండా సునీల్ మరియు అనసూయ పాత్రలు కూడా పుష్ప 2 లో అత్యంత కీలకంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది.

మొత్తానికి పుష్ప రెండవ భాగం పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.దాదాపు సంవత్సర కాలం పాటు స్క్రిప్ట్ వర్క్ చేసిన దర్శకుడు సుకుమార్ అన్ని వర్గాల ప్రేక్షకులను అల్లరించే విధంగా సినిమా ను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమా స్థాయిని మరింతగా పెంచడం ఖాయం అని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube