ఆస్కార్ అవార్డ్ ప్రతిమ.. బంగారం కాదట.. ఈ అవార్డు వెనక నిజాలు

సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారు ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకోవాలని ఆశ పడుతూ ఉంటారు.జాతీయ అవార్డులు సొంతం చేసుకుంటే ఇక ఎంతగానో మురిసిపోతూ ఉంటారు.

 Facts Behind Oscar Award Idol Details, Oscar Award, Oscar Award Idol, Interestin-TeluguStop.com

కానీ నటీ నటులకు ఎవరికైనా ఆస్కార్ అవార్డు వచ్చిందంటే చాలు ఈ జీవితానికి ఇంకేం వద్దు ఇది చాలు అని సంబర పడిపోతూ ఉంటారు.

ఇక ఒక్కసారి ఆస్కార్ అవార్డు వచ్చిందంటే చాలు జన్మ ధన్యం అయిపోయింది అని భావిస్తూ ఉంటారు.

ఇకపోతే ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డుల వేడుక కన్నుల పండుగగా జరిగింది.ఏడాది ఆస్కార్ అవార్డులు ఎవరు దక్కించు కుంటారు అని ప్రపంచ సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.

అయితే 1929 నుంచి హాలీవుడ్లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అవార్డులను అందజేస్తూ ఉన్నారు.మరి ఆస్కార్ అవార్డులు ఎందుకు అంత ప్రత్యేకం అసలు వీటి స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసు కుందాం.

ఆస్కార్ అవార్డు చరిత్రలోనే అత్యధిక అవార్డులు అందుకుంది వాల్ డిస్నీ యానిమేషన్ సినిమాల్లో తనదైన ముద్ర వేసి యాభై తొమ్మిది సార్లు నామినేట్ కాగా 22 సార్లు అస్కార్ విజేతగా నిలిచారు.

అయితే ఆస్కార్ అవార్డు బంగారు ప్రతిమ అని అందరూ అనుకుంటారు.

కానీ కాదు కాంస్యం తో తయారు చేసి 24 క్యారెట్ బంగారం పూత పూస్తారు.అచ్చం బంగారం లాగా కనిపిస్తూ ఉంటుంది.

Telugu Academy, America, Heath Ledger, Hollywood, Katherine Burn, Oscar Award, P

ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఇక ఆ ప్రతిమను అమ్మి వేయడానికి అవకాశం ఉండదు.ఇక ఈ మేరకు కాంట్రాక్టుపై సంతకం చేయాలి.1953 మార్చి 19వ తేదీన బ్లాక్ అండ్ వైట్ టీవీ లో తొలిసారి ఈ వేడుకలు ప్రసారం కావడం గమనార్హం.అయితే మరణించిన తర్వాత ఆస్కార్ అవార్డు దక్కించు కుంది ఇప్పటివరకు కేవలం ఇద్దరు కళాకారులు మాత్రమే.

ఆస్ట్రేలియన్ పీటర్ పించ్, హీత్ లేడ్జెర్ కు ఈ అవార్డులు చనిపోయిన తర్వాత దక్కించు కున్నారు.

Telugu Academy, America, Heath Ledger, Hollywood, Katherine Burn, Oscar Award, P

ఇక బెన్హర్ టైటానిక్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలు 11 చొప్పున ఆస్కార్ అవార్డులను గెలుచుకోవడం గమనార్హం.ఇక ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు బెస్ట్ డైరెక్టర్ గా  ఆస్కార్ అవార్డును దక్కించు కున్నారు.ఇక నాన్ ఇంగ్లీష్ సినిమా కేటగిరీలో ఇప్పటి వరకు అత్యధిక సార్లు ఆస్కార్ అవార్డును గెలుచు కుంది ఇటలీ అని చెప్పాలి.14 సార్లు ఆస్కార్ అవార్డులను గెలుచుకోవటం గమనార్హం.

ఇక అమెరికాకు చెందిన కేథరీన్ హాఫ్ బర్న్ నాలుగు సార్లు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు గెలుచు కుంది.

ఇక అమెరికన్ అటు జాక్ నీకోల్ యూకే కి చెందిన డేనియల్ డే లూయిస్ ఇద్దరు కూడా చెరో మూడుసార్లు ఆస్కార్లు గెలుచు కున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube