టీడీపీ 40 వసంతాల వేడుకలు సందర్భంగా బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..!!

దక్షిణాది రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల పరంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది అని చెప్పవచ్చు.ఒకానొక సమయంలో ఢిల్లీ నాయకులను శాసించే రీతిలో టీడీపీ కింగ్ మేకర్ గా నిలిచింది.

 Balakrishna's Key Remarks During The Tdp 40th Spring Celebrations Balakrishna,-TeluguStop.com

ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు కావటంతో ఉభయ రాష్ట్రాల్లో 40 వసంతాల వేడుకలు పార్టీ కార్యకర్తలు నాయకులు ఘనంగా జరుపుతున్నారు.ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు నందమూరి తారక రామారావు తనయుడు హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ.

పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ముందుగా పార్టీ కార్యకర్తలకు మరియు అభిమానులకు నాయకులకు శుభాకాంక్షలు తెలియ జేశారు.

పార్టీకి కార్యకర్తలే కంచు కోట అని.పోరాటమే మన ఊపిరి అని ఉద్ఘాటించారు.ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి ఇదే అని స్పష్టం చేశారు.నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండా రెపరెపలాడుతోంది అంటే దానికి లక్షలాది మంది కార్యకర్తలు.కోట్లాది ప్రజల ఆశీస్సులు ముఖ్య కారణం అని చెప్పు కొచ్చారు.తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రలో తెలుగు దేశం పార్టీ కొత్త శకం లిక్కించింది అని పేర్కొన్నారు.

దేశంలోనే ఆడబిడ్డలకు ఆస్తి హక్కు కలిపించిన తొలి పార్టీ మాత్రమే కాదు దీక్సుచిగా పార్టీ నిలిచిందని పేదల సంక్షేమానికి, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడింది.ఎత్తిపోతల పథకాలతో రాష్ట్రం అన్నపూర్ణ అయింది అంటే దానికి పార్టీ ఘనతేనని బాలకృష్ణ తెలియ జేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube