సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో అంతర్భాగమయ్యాయి.నవ్వించడం నుంచి ఏడిపించడం వరకు అన్ని విధాలుగా వినోదాన్ని అందించే సాధనాలుగా సినిమాలు మారాయి.
అయితే సినిమాల వల్ల చాలామంది ఉపాధి కూడా పొందుతుంటారు.యాక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్స్, ఫైటింగ్ మాస్టర్స్, స్టోరీ రైటర్స్( Actors, music directors, singers, fighting masters, story writers ) ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం గడుపుతున్నారు.
నిజానికి చెత్త సినిమాలే కాక ఈరోజుల్లో మంచి సినిమాలు కూడా వస్తున్నాయి.వాటిని అభిమానించే వారందరూ కళాపోషకులు అని చెప్పవచ్చు.
మరి సినిమాలు లేకపోతే ప్రజలు బతకగలరా, గతంలో ఎలా కాలక్షేపం చేసేవారు అని అడిగితే, దానికి సమాధానం ఉంది.అప్పట్లో స్ట్రీట్ డ్రామాలు, ఫోక్ డ్యాన్స్‌లు, ట్రెడిషనల్ డ్యాన్స్ పర్ఫామెన్స్, మ్యూజిక్ కన్సర్ట్స్, హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాట వంటివన్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పంచేవి.
ఇక ప్రజలు పనిలో బోర్ కొట్టకుండా పాటలు పాడుతూ పనులు చేసుకునేవారు.
సినిమాలు రావడానికి ముందు డ్రామాలకు బాగా డిమాండ్ ఉండేది.
దానివల్ల నాటక పరిషత్తులు అన్ని చోట్లా అందుబాటులోకి రావడం మొదలయ్యాయి.చివరికి నాటకాలు ప్రజలందరికీ సుపరిచితమయ్యాయి.
ఆ కాలంలో ‘సురభి నాటక సమాజము’( Surabhi Natak Samajamu ) బాగా ఫేమస్ అయ్యింది.ఈ నాటక సమాజం వారు ఆడ వేషాలను ఆడవారి చేతే తొలిసారిగా వేయించారు.
అంతకుముందు మగవారే ఆ పాత్రలను పోషించేవారు.ఆ ఘనత సాధించడమే కాక స్టేజీ మీదనే అన్ని రకాల సెట్టింగ్స్ వేసేవారు.
సీన్స్‌లో భూమి విరిగినట్లు, మంటలు వస్తున్నట్లు, మెరుపులు, వాన పడుతున్నట్లు ఎఫెక్ట్‌లు కూడా జోడించేవారు.అప్పట్లో అవి చూసి జనాలు ఆశ్చర్యపోయేవారు.
తక్కువ కాలంలోనే ఈ సమాజం గురించి అందరికీ తెలిసింది.

ఇక రంగస్థలం లేదా నాటకరంగంలో స్థానం నరసింహారావు, అద్దంకి శ్రీరామమూర్తి, ఎ.వి.సుబ్బారావు, అబ్బూరి వరప్రసాదరావు, కళ్యాణం రఘురామయ్య, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, బళ్ళారి రాఘవ, చిలుకమఱ్ఱి నటరాజ గోపాల మూర్తి, చిత్తూరు నాగయ్య, కన్నాంబ వంటి వారు రాణించారు.వారిలో చిత్తూరు నాగయ్య, కన్నాంబ వంటి కొందరు సినిమాల్లోకి కూడా రంగ ప్రవేశం చేశారు.మరి సమాజానికి సినిమాలు అవసరమేనా అని ప్రశ్న చాలా మందిలో తలెత్తవచ్చు.
నిజానికి సినిమా పరిశ్రమ ఎందరో కళాకారులకు ఒక మాతృమూర్తిగా నిలిచింది.కాలం గడుస్తున్న కొద్దీ సినిమాల రేంజ్ బాగా పెరుగుతుంది.
బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇప్పుడు 3D, 8K క్వాలిటీ సినిమాలు తీసే రేంజ్‌కు సినిమా రంగం వెళ్ళింది.ఒకప్పుడు థియేటర్లు, టీవీలకే పరిమితమైన సినిమాలు ఇప్పుడు మొబైల్ లో కూడా చూసేందుకు అందుబాటులోకి వస్తున్నాయి.
ఓటీటీల తర్వాత సినిమాలు నేరుగా ఇంట్లో కూర్చొని చూసుకునే సదుపాయం వచ్చింది.వెబ్ సిరీస్, టీవీ షోస్ కూడా అద్భుతమైన వినోదాన్ని పంచుతున్నాయి.
అంతే కాదు,కొన్ని ముఖ్యమైన నిజ జీవిత సంఘటనలు కూడా ఓటీటీ షోల రూపంలో అందుబాటులోకి వస్తున్నాయి.

వీటివల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది.చాలామందికి టెక్నాలజీ, సైన్స్, హిస్టరీ టాపిక్స్‌కు సంబంధించిన అనేక కొత్త విషయాలు కూడా తెలుస్తున్నాయి.మన ఇండియన్స్ ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ పై ఆధారపడతారు కానీ హాలీవుడ్ సినిమాలు చాలా విషయాలను తెలియచేస్తాయి.
ఇక సినిమాల వల్ల చెడిపోయే వారే కాకుండా మంచి విషయాలు నేర్చుకుని బాగుపడేవారు కూడా ఉంటారు.అలానే సినిమాల వల్ల ప్రభుత్వాలకు కూడా ఆదాయం వస్తోంది.జర్నలిస్టులకు ఉపాధి లభిస్తోంది.దర్శకులకు తమ ప్రతిభను చాటుకునే వేదికగానూ మూవీ ఇండస్ట్రీ నిలుస్తోంది.
ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డన్ని ప్రయోజనాలు.అందువల్ల ఈ సమాజంలో సినిమాలు నిజంగా అవసరమే.








